చంద్రబాబు నెత్తిన మరో ‘గుదిబండ’

త్వరలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా, మరో రెండు మాసాల్లో బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటిని తొలుత నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే నిర్వహించాలని భావించినా, చివరకు హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే, ఏపీకున్న రెవిన్యూ కష్టాల రీత్యా వచ్చే ఆర్ధిక సంవత్సరం 2016-17 బడ్జెట్ చాలా కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిని మలుపు తిప్పే ఏడాదిగా రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కార్యరూపంలో పెట్టాల్సిన సంవత్సరంగా 2016-17 పేరు తెచ్చుకుంది.

దీంతో బడ్జెట్ నిర్వహణపై దృష్టి సారించిన అధికారులకు ముందుగా ‘ఉద్యోగుల పదవీ విరమణలు’ ఎదురు వచ్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి 3.50 లక్షల మందిలో 2 శాతం మంది తమ విధుల నుండి రిటైర్ కానున్నారని సమాచారం. 2016, జూన్ 2 నుండి 2017 మార్చ్ 31వ తేదీ లోపున దాదాపుగా 6,017మంది రిటైర్మెంట్ కానున్నారని అధికారులు లెక్కలు కట్టారట.

2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే, ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుండి 60 సంవత్సరాలకు పెంచడంతో, గడిచిన 18 నెలలుగా ఒక్క రాష్ట్ర ఉద్యోగి కూడా రిటైర్ కాలేకపోయారు. దీంతో భారమంతా వచ్చే ఆర్ధిక సంవత్సరం పై పడింది. 2016-17లో రిటైర్ కానున్న ఈ ఉద్యోగుల నిమిత్తం రాష్ట్ర ఖజానాపై దాదాపుగా 2000 కోట్లు అదనపు భారం పడబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల రీత్యా 2 వేల కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఇది వాయిదా వేసే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదు. రిటైర్ అయ్యే సమయంలో గ్రాట్యుటి మరియు ఇతర ఆర్ధిక సదుపాయాలన్నీ ఉద్యోగి ఖాతాలోకి వెళ్ళాల్సిందే. దీనిపై ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్లుగా, అందుకు సంబంధించిన ప్రతిపాదనలను 2016-17 బడ్జెట్ లో పొందుపరచినట్లుగా సమాచారం.

Share
Published by

Recent Posts

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

7 minutes ago

గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…

27 minutes ago