
అయితే తర్వాత ‘ట్విస్ట్’ జ్యోతుల నెహ్రూ నుండి వచ్చింది. పార్టీ మారతారని వస్తున్న వార్తలపై జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ… “ప్రస్తుతానికి తాను పార్టీని మారబోవడం లేదని” ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరే విషయమై తాను ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదని మీడియా ముందు జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. అయితే జ్యోతుల నెహ్రూ ఇచ్చిన ఈ ‘ట్విస్ట్’ వెనుక ఉదయం నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఓటు ఒక దేశ భవిష్యత్, ఓటు ఒక నాయకుడి మీద నమ్మకం, ఓటు ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు...ఆ హక్కును వినియోగించుకోవడం…
SS Rajamouli is known for changing the rules of Indian cinema, both in filmmaking and…