
నాగశౌర్యతో అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించిన “ఊహలు గుసగుసలాడే” సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగశౌర్యకు ఒక బేస్ ఏర్పాటు చేసిన ఈ సినిమా నిజానికి సుధీర్ బాబు చేయాల్సినదట, అది కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో! ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ స్క్రిప్ట్ అందించగా, ఇంద్రగంటి దర్శకత్వంతో ప్రారంభమైన కొద్ది రోజులకే ఆగిపోయింది.
ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ చిన్న చిన్న మార్పులతో “ఊహలు గుసగుసలాడే” పేరుతో తెరకెక్కించారు. నాగశౌర్య – రాశి ఖన్నాలు జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలా ఓ మంచి సినిమా తన నుండి చేజారిపోయిందని చెప్పిన సుధీర్ బాబు, ఈ “సమ్మోహనం” మాత్రం ప్రేక్షకులను అలరిస్తుందని, నటుడిగా తనకు పేరు తీసుకువస్తుందని ఎంతో విశ్వాసంతో చెప్తున్నాడు.
Diwali is one of the biggest periods for Indian cinema, with major films often targeting…
The Telugu box office has been tasting reasonable success in the recent past and we…