
అప్పటివరకు నడిచిన సినిమా అంతా ఒకెత్తు అయితే, గోడకు అంటించిన ఆది పోస్టర్ క్రిందకి జారుతూ మొదలైన షాట్ నుండి చంద్రబోస్ ఆలపించిన పాట ‘ఓరయ్యో నా అయ్యా’ పాట ముగిసే వరకు వచ్చిన సన్నివేశాలు సినిమాను ‘బ్లాక్ బస్టర్’ స్థాయికి తీసుకెళ్ళాయి. కరుడు హృదయాన్ని కూడా కరిగించే విధంగా చంద్రబోస్ రచించి ఆలపించగా, సుకుమార్ అంతకుమించిన విధంగా సిల్వర్ స్క్రీన్ పై ఉంచారు.
ఓ పక్కన సెంటిమెంట్ ను పండిస్తూ, మరో పక్కన రివేంజ్ ను ప్రదర్శిస్తూ చిత్రీకరించిన ఈ పాట ‘రంగస్థలం’లో హైలైట్ గా నిలపడంలో దేవి ప్రాముఖ్యత కూడా చెప్పలేనిది. అంత కీలకమైన పాట కావడంతోనే ఆడియో సాంగ్ ను ముందుగా విడుదల చేయకుండా, సినిమా హిట్టయిన తర్వాత రిలీజ్ చేసారు. అలాగే 50 రోజులు పూర్తి కానున్న నేపధ్యంలో తాజాగా వీడియో సాంగ్ ను కూడా వదిలారు. ఫైనల్ గా… ఈ పాటలో తండ్రి పాత్రలో నటించిన నరేష్ ప్రదర్శించిన హావభావాలు అమోఘం.
#AK47 Review: A Safe Family Watch Venky is the film’s biggest strength, with Satya delivering…
Tension in Bigg Boss Telugu Season 10 is rising after the dramatic double elimination of…