
దేశమంతా పొగిడిన మేజర్ ని మొదటిసారి వరల్డ్ ప్రీమియర్ చేస్తే కనీసం 2 రేటింగ్ రాలేదు. బ్రహ్మాస్త్ర చాలా బెటర్ గా 6 దాకా తెచ్చుకుంది. ఈ ఏడాది టాప్ గా 12తో బలగం నిలిచింది. నిర్మాతలు డిజిటల్ డీల్స్ ని నిర్మాణంలో ఉన్నప్పుడే చేయాలా లేక రిలీజై బ్లాక్ బస్టరయ్యాక అమ్ముకోవాలా అనే అయోమయంలో నలిగిపోతున్నారు.
మలయాళం సెన్సేషన్ 2018కి నెల రోజులకే స్ట్రీమింగ్ చేసుకునే ఒప్పందం మీద విడుదలకు ముందే అమ్మేశారు. తీరా చూస్తే కేరళ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. తెలుగు డబ్బింగ్ బాగా ఆడుతోంది. కాస్త ఆపుదామా అంటే సదరు సోనీ లివ్ నో చెప్పిందని టాక్. అయినా బంగారం లాంటి అవకాశం వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. దాదాపు ఓటిటిలన్నీ ఇదే పాలసీని ఫాలో అవుతాయి.
అందుకే మేం ఫేమస్ నిర్మాతలు ఫలితం వచ్చాక ఎక్కువ రేట్ వస్తుందని భావించి ఓటిటి రైట్స్ అమ్ముకోలేదు. సినిమా పెట్టుబడితో పాటు కొంత లాభాలు తెచ్చేలా సక్సెస్ అయ్యింది కానీ జాతిరత్నాలు, ఉప్పెన లాగా మరీ పాతిక ముప్పై కోట్లు రాబట్టేంత సీన్ లేదని అర్థమైపోయింది. సహజంగానే ముందు అనుకున్న భారీ మొత్తం కన్నా తక్కువతో సర్దుకోవాల్సి ఉంటుంది.
పరేషాన్ ని తెలివిగా ముందే డీల్ చేసుకోవడం ఇప్పుడొచ్చిన ఫ్లాప్ టాక్ వల్ల రెవిన్యూ పోతుందేమో కానీ నిర్మాత వైపు చూస్తే హ్యాపీగా సేఫ్ అయిపోయారు. ఇక అహింస అంత సులభంగా అమ్ముడుపోయేలా లేదు. గతంలో వచ్చిన హోరాహోరి లాంటి తేజ తీసిన కళాఖండాలు కేవలం రిజల్ట్ వల్లే నిర్మాతలకు ఎక్స్ ట్రా ఇన్కమ్ రాకుండా చేశాయి.
ఎంత ఇండస్ట్రీ హిట్ అయినా సరే నెల కనిష్టంగా పదిహేను రోజుల నుంచి గరిష్టంగా నెలన్నరలోపు అయితే అయితే ఓటిటిలు మంచి రేట్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. లేదంటే మా ప్లాట్ ఫార్మ్ పై పెట్టుకోండి వ్యూస్ కు వచ్చిన డబ్బుల్లో పంచుకుందామని మెలిక పెడుతున్నాయి. ఇలా చేస్తే అధిక శాతం సినిమాలకు వచ్చేది చిల్లరే. అందుకే ఓటిటి ఒప్పందాలు త్రిశంకు స్వర్గంలో జరుగుతున్నాయి.
After Dragon, NTR is expected to join hands with Trivikram Srinivas for GOW. However, a…
Vidya Balan has revealed that missing the chance to play legendary Carnatic singer M.S. Subbulakshmi…