
ఓటీటీ వర్సెస్ థియేటర్లు అనేది గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ఓటీటీ విండో విషయంలో తీసుకున్న నిర్ణయం తెలిసిందే. 8 వారాల ఓటీటీ విండో అనేది సాధ్యపడదని, 4 వారాలకు పరిమితం చేయడం బెటర్ అని అందరూ ఒక డెసిషన్ కి వచ్చారు. ఈమేరకు అఫీషియల్ ప్రెస్ ఇన్ఫో కూడా రిలీజ్ చేసారు.
4 వారాలకు ఓటీటీలోకి సినిమా వచ్చేస్తే, జనాలు థియేటర్ కి ఎందుకొస్తారు? అనేది డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్ల వాదన. అసలు 8 వారాలు సినిమా థియేటర్లో ఆడుతుందా అనేది నిర్మాతల వాదన. ఇద్దరూ లాజికల్ గానే వాదిస్తున్నప్పటికీ.. ఎవరికి ఎవరు చేటు చేస్తున్నారు అనేది ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్న.
అయితే.. చెన్నైలోని శ్రీ శక్తి సినిమాస్ ఓనర్ సుబ్రమణ్యం మాత్రం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. తమిళ సినిమాలేవైనా సరే 8 వారాలా ఓటీటీ విండో ఉంటేనే తన థియేటర్లో రిలీజ్ చేస్తానని లేకపోతే చేయనని డిక్లేర్ చేశాడు. చెన్నైలో పాపులర్ థియేటర్ అయిన శ్రీ శక్తి సినిమాస్ లో తమ సినిమా రిలీజ్ చేయాలి అనేది ప్రతి దర్శకనిర్మాత కల. అలాంటి ఓనర్ ఇలా 8 వారాలా ఓటీటీ విండో గురించి ఇలా ఇండైరెక్ట్ గా డిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది తెలియాల్సి ఉంది.
సినిమా కంటెంట్ బట్టి థియేటరికల్ రన్ ఉండాలి కానీ.. ఇప్పుడు అరచేతిలో ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉన్నప్పుడు కంపల్సరీ ప్రతి సినిమాకి 8 వారాల థియేట్రికల్ రన్ అనేది అసాధ్యం. ఏవో దురంధర్ లాంటి సినిమాలు తప్ప థియేటర్లలో అన్నేసి వారాలు ఆడుతున్న సినిమాలు ఏమున్నాయ్ అసలు. మరి ఈ పరిస్థితికి నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లు/ఎగ్జిబిటర్లు కూలంకుషంగా పరిష్కారం అందించాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…