
“ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో” అనే సినిమా బాగున్నా సరైన ప్రమోషన్స్ లేక థియేటర్లలో నిలబడలేకపోయింది అని తెగ బాధపడిపోయాడు తిరువీర్. నా నిర్మాతలు ఎందుకో లాస్ట్ కి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు అని వాపోయాడు కూడా. అందుకే తన తాజా చిత్రం “పాపం ప్రతాప్” విషయంలో మాత్రం ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకుండా.. కాన్సెప్ట్ వీడియోలని, ప్రమోషనల్ ఈవెంట్లని అన్నీ చేశాడు.
నిజానికి ఈటీవీ విన్ చేసిన డిజిటల్ ప్రమోషన్స్ కూడా కొంతమేరకు బాగానే వర్కవుట్ అయ్యాయి. “పాపం ప్రతాప్” అనే సినిమాని కొంతమేరకు జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ తరహా చిన్న సినిమాలకి మొదటి రోజు కలెక్షన్స్ ఉండవులే అని సరిపెట్టుకున్నా.. ఫస్ట్ వీకెండ్ మొత్తానికి కనీస స్థాయి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.
ఓవర్సీస్ లో అయితే కనీసం 31K డాలర్ల మార్ దాటడానికి కూడా నాలుగు రోజులు పట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ఏమీ రాలేదు. తిప్పికొడితే కోటి రూపాయల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
పాపం ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు తిరువీర్. ఈ సినిమా హిట్ అయితే తన తదుపరి సినిమాలకి పనికొస్తుంది అనుకున్నాడు. అయితే.. ఎంత ప్రమోట్ చేసినా, కంటెంట్ లో దమ్ము లేనప్పుడు ఇలాంటి రిజల్ట్ తప్పదు మరి.
సో, ఈ సినిమాతో మంచి బ్రేక్ వస్తుందనుకున్న తిరువీర్ కి నిజంగానే పెద్ద బ్రేక్ వచ్చింది, కాకపోతే సక్సెస్ నుంచి.
Hyderabad’s real estate scene is changing fast, and the biggest example right now is Kokapet.…
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కేసీఆర్ ఇద్దరూ సోమవారం సాయంత్రం వేర్వేరు ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు…