
సుప్రసిద్ధ జర్నలిస్ట్ (నీరజ్ కబీ) పై హత్యాయత్నాన్ని ఛేదించడానికి ఒక జాడెడ్ పోలీసు అధికారి (జైదీప్ అహ్లవత్) ను నియమిస్తారు. అతను నలుగురుని అనుమానిస్తాడు. వారిలో ఒక మహిళ, ఒకరు కరడుగట్టిన నేరస్థుడు (అభిషేక్ బెనర్జీ). ఈ కేసు అతని జీవితాన్ని తలక్రిందులుగా చేస్తుంది. అతనికి క్రూరమైన నేరస్థులు ఉండే లోకం – పాతాళ లోక్ తో విరోధం ఏర్పరుస్తుంది.
కథలో కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. అయితే ట్రైలర్ లోనే వయోలెన్స్ ఎక్కువగా ఉంది. ఇక వెబ్ సిరీస్ లో ఏ రేంజ్ లో ఉంటుందో. ట్రైలర్ ని చూస్తున్నంత సేపు.. జైదీప్ అహ్లవత్, అభిషేక్ బెనర్జీ పెర్ఫార్మన్స్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హార్దిక్ మెహతా ఈ వెబ్ సిరీస్ కు సృష్టికర్త, రచయిత మరియు దర్శకుడు. ఈ దర్శకుడు ఇటీవలే కమ్యాబ్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఇది విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను పొందింది. దానితో ఈ వెబ్ సిరీస్ మీద అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పుకోవాలి.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…