
పాక్ సైన్యాన్ని ఉటంకిస్తూ రాసిన ఈ వార్తల్లో 14 మంది భారత సైనికులను పాక్ దళాలు హతమార్చాయని, చందుబాబులాల్ చౌహాన్ (22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. జియో న్యూస్ 14 మంది భారత సైనికులు అని పేర్కొనగా, ‘డాన్’ 8 మంది అని పేర్కొనడం గమనార్హం. అయితే పాక్ సైనిక్ వెబ్‌సైట్‌లో మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం విశేషం.
అయితే పాక్ మీడియా కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. భారత్ తనన ఖండనను ప్రకటించిన కాసేపటికే డాన్ పత్రిక తన వెబ్‌సైట్ నుంచి భారత సైనికులను హతమార్చిన కథనాన్ని ఉపసంహరించుకుంది. కాగా చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాడి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని, సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని తెలిపింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…