
చిరంజీవికి జన్మనిచ్చిన తండ్రి, పిల్లను ఇచ్చిన మామ… వాళ్లిద్దరూ లెఫ్టిస్ట్ లు. వాళ్లిద్దరి భావజాలం తెలియకుండానే చిరంజీవిలో పడింది. ‘ఖైదీ’ సినిమా నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారు మాతో మాటలు రాయించుకుంటూనే ఉన్నారు. 2005 తర్వాత చాలా మంది హీరోలు పరుచూరి బ్రదర్స్ తో మాటలు రాయించుకోలేదు. కానీ, చిరంజీవి గారు అలా కాదు. “ఖైదీ నంబరు 150” చిత్రానికి మాటలు రాసేందుకు లేటెస్ట్ గా ఉన్న మాటల రచయితలను పెట్టుకోవచ్చు… పరుచూరి బ్రదర్స్ నే మాటలు రాయమని ఆయన అడగక్కర్లేదు. కానీ, మా మీద ఉన్న నమ్మకం, ఆత్మీయతతోనే చిరంజీవి గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా అసలు ‘పరుచూరి బ్రదర్స్’ అన్న పేరు ఎలా పుట్టిందో కూడా చెప్పుకొచ్చారు. మేము మాటలు రాసిన తొమ్మిది చిత్రాల వరకు ‘పరుచూరి’ అనే పేరు వస్తుండేది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి ‘అనురాగ దేవత’ చిత్రానికి మాటలు రాస్తున్నాము. ‘మీరు ఇద్దరు ఉన్నారు కదా, మరి, పరుచూరి అనే ఇస్తున్నారేంటి? అని ఎన్టీఆర్ గారు అన్నారు. అందుకు ఏదో సమాధానం చెప్పాం. ఈలోగా, ఎన్టీఆర్ గారే, మాకు పేరు పెడతామని చెప్పి ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేశారు. అయితే, ఆయన చెప్పింది మాకు ఎక్కలేదు.
ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ గారు… ‘రామ లక్ష్మణులు’ అంటే అన్నదమ్ముల పేర్లు విడివిడిగానే ఉంటాయి. కానీ, ‘పరుచూరి బ్రదర్స్’ అన్న దాంట్లో అన్నదమ్ములు ఇద్దరూ కలిసే ఉంటారు’ అని ఎన్టీఆర్ గారు వివరించి చెప్పడంతో ఆంతర్యం అప్పుడు మాకు అర్థమైంది’ అంటూ నాటి విషయాలను పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ‘అన్న ఎన్టీఆర్ గారితో గురుభావంతో ఉన్నాము. బాలకృష్ణ, మోహన్ బాబు గార్లతో సోదరభావంతో ఉన్నాము. చిరంజీవి గారితో ఆత్మీయానుబంధంతో ఉన్నాము’ తమ బంధాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…