Telugu

పఠాన్ తీసుకొచ్చింది పాత పటాసులే అయితేనేం

2018 జీరో రూపంలో దారుణమైన డిజాస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్ దీంతో కలిపి దానికన్నా ముందు వచ్చిన ఫ్లాపులన్నీ బేరీజు వేసుకుని పెద్ద గ్యాపే తీసుకున్నాడు. ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేసినా తొందరరపడకుండా తనకు తగ్గ కథ కోసం వేచి చూసి పఠాన్ ని ఓకే చేశాడు. పెద్ద బ్యానర్, భారీ బడ్జెట్, టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్, క్రేజీ విలన్, అన్నిటిని మించి అభిమానులు కోరుకునేలా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న యాక్షన్ సబ్జెక్ట్. అందుకే పఠాన్ మీద ఇంతే క్రేజ్. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ప్రేక్షకులు బాద్షా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో క్లారిటీ ఇచ్చేశారు. కెజిఎఫ్ రికార్డులను టార్గెట్ చేసిన పఠాన్ మీదే బాలీవుడ్ ఆశలన్నీ.

సరే ఇంతా హంగామా ఉంది కదాని పఠాన్ కథలో కొత్తదనం ఆశించకండి. కానీ కింగ్ ఖాన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో వాటిని మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నాడు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్. భార్య చావుకు కారణమయిందన్న కోపంతో దేశద్రోహానికి పాల్పడే విలన్ అలియాస్ జాన్ అబ్రహం. ఆర్టికల్ 370 చర్యకు నిరసనగా ఇండియా మీద కోపంతో ఓ పాకిస్థాన్ అధికారి వచ్చి డీల్ కుదుర్చుకుంటే ఓకే చెప్పి ఏకంగా మన దేశపు అధికారులకు వార్నింగ్ ఇస్తాడు. ఇతని అంతు చూడాలంటే మనవల్ల కాదని అర్థం చేసుకున్న రా బృందం మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ కోసం ఫారిన్ లో వెతుకుతున్న పఠాన్ సహాయం కోరుతుంది. ఆ తర్వాత జరిగేది మీ ఊహకు అందేదే.

ADVERTISEMENT

హృతిక్ రోషన్ వార్ లో నేలవిడిచి సాము చేయించి హిట్టు కొట్టిన సిద్దార్థ్ ఆనంద్ ఈసారి అంతకు మించిన సెటప్ ఎంచుకున్నాడు. ప్రతి ట్విస్టు దాదాపుగా ఊహించేలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే నెమ్మదిగా ఉన్నా యాక్షన్ బ్లాక్స్ పరుగులు పెడతాయి. ఒక దేశం లొకేషన్లను ఆస్వాదిస్తుండగానే హఠాత్తుగా ఇంకో కంట్రీకి షిఫ్ట్ చేస్తాడు. దుబాయ్ వీధుల్లో షారుఖ్ జాన్ అబ్రహంలు కొట్టుకుంటారు. ఇంకోసారి బ్రిడ్జ్ మీద రన్నింగ్ ట్రైన్ లో షారుఖ్ సల్మాన్ లు కలిసి రౌడీ గ్యాంగ్ దుమ్ము దులిపి పెయిన్ కిల్లర్లు వేసుకుని నడుచుకుంటూ వెళ్తారు. ఇదంతా ఫార్ములా మేకింగే. పేపర్ మీద చదివితే సాధారణం అనిపించే సీన్లు స్క్రీన్ పైకి వచ్చే సరికి గ్రాండియర్ లుక్ తో ఆకట్టుకుంటాయి.

పఠాన్ ని నిలబెట్టింది ఈ భారీతనమే. పెద్ద ఎమోషన్లు లేకపోయినా కంటెంట్ తో కనెక్షన్ ఉండేలా సిద్దార్థ్ జాగ్రత్త పడ్డాడు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోమని యష్ రాజ్ సంస్థ ఇచ్చిన స్వేచ్ఛని విచ్చలవిడిగా వాడేసుకుని దేశీమేడ్ మిషన్ ఇంపాజిబుల్ ని ఆవిష్కరించాడు. ఎప్పటికీ చెప్పుకునే గొప్ప చిత్రంగా పఠాన్ నిలుస్తుందా లేదనేది చెప్పలేం కానీ కరువులో ఉన్న షారుఖ్ ఖాన్ అభిమానుల ఆకలి తీర్చేలా సగం ఉడికిన అన్నంతోనే రుచికరమైన మసాలా బిర్యానీ వండి పెట్టారు సిద్దార్థ్ షారుఖ్ లు. రుచి బాగున్నప్పుడు రోడ్డు మీద తినడానికి కూడా వెనుకాడని జనాలకు కంటెంట్ ఊగిసలాడినప్పటికీ కంటికింపుగా యాక్షన్ విందు పెట్టినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు నో అంటారు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Varanasi Release in Doubt? Prabhas’ Fauzi May Benefit

SS Rajamouli's Varanasi is one of the most ambitious projects in Indian cinema, with Mahesh…

27 minutes ago

Jana Sena Seat Sharing Sparks Revolt in Tiruvuru and Salur

The NDA alliance is facing growing discontent over seat sharing in Tiruvuru and Salur, with…

57 minutes ago