రజనీకాంత్ బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్?

pawan kalyan also like rajnikanth
తానూ నటించిన సినిమాలను కొనుగోలు చేసి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు పరిపాటి. రజనీ నటించిన సినిమాలలో అపజయాలు తక్కువగా ఉన్నప్పటికీ ‘బాబా’ వంటి కొన్ని చిత్రాలకు అసాధారణ నష్టాలు రావడంతో వాటిని పూడ్చే బాధ్యతను రజనీ నెత్తికెత్తుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే బాటలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పయనిస్తున్నాడు.

గతంలో పవన్ దర్శకత్వం వహించిన ‘జానీ’ సినిమా దారుణ పరాజయం చవిచూసిన సందర్భంలో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకున్న పవన్, తాజాగా మరోసారి అలాంటి బాధ్యతలనే స్వీకరించాల్సి వస్తోందని ట్రేడ్ వర్గాలు ఘోషిస్తున్నాయి. అభిమానులు జీర్ణించుకున్నా, లేకున్నా ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా మార్కెట్ లలో కాదు, ఇటు ఏపీ, తెలంగాణాలలో కూడా మొదటి రోజు తర్వాత నుండి ప్రారంభమైన కలెక్షన్స్ తగ్గుముఖం సోమవారం నాటికి పతాక స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది.

ADVERTISEMENT

దీంతో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను అత్యధిక ధరలకు కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి రావడం దాదాపుగా ఖరారైంది. అయితే ఈ సినిమా లాభనష్టాలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని ‘ఈరోస్’ సంస్థ విడుదలకు ముందే ప్రకటించడంతో డిస్ట్రిబ్యూటర్లు వారిని అడిగే హక్కును కోల్పోయారు. దీంతో ఈ బాధ్యత పవన్ పై పడింది. నిర్మాణంలో భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ రికార్డు ధరకే ‘ఈరోస్’ సంస్థకు అమ్మేయడంతో నిర్మాత అయిన శరత్ మరార్ ముందుగానే లాభాలు ఆర్జించారు.

బహుశా ఈ లాభాలలో నుండి కొంత మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లకు పంచవచ్చని తెలుస్తోంది. అలాగే తన తదుపరి సినిమా ద్వారా కూడా ఆదుకోవడానికి పవన్ ముందుకు వస్తున్నట్లుగా టాక్. ఏదొక రూపేణా నష్టపోయిన వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ పై అభిమానులు ‘దటీజ్… పవన్ కళ్యాణ్…’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇలా కంటే… ఒక భారీ హిట్టు కొట్టి ‘దటీజ్… పవన్ కళ్యాణ్…’ అంటే ఇంకా బాగుండేదేమో… అనడం సినీ విశ్లేషకుల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories