
అదే ఇండియన్ స్పెషల్ మూవీ..! ‘బాహుబలి 2’ 1000 కోట్లకు చేరుకున్న సందర్భంగా అంతగా ఈ సినిమా గురించే చర్చ జరుగుతున్న శుభసందర్భాన… మన టాప్ హీరోలు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్లు వేసారు. మహేష్ విడుదల సమయంలో చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పగా, తాజాగా 1000 కోట్లకు చేరుకున్న సందర్భంగా మరోసారి ట్వీట్ చేసారు. ఊహించడానికే సాధ్యం కానటువంటి 1000 కోట్లను అందుకుని, ఇంకా ఆగని ఈ కలెక్షన్ల ఒరవడిని ప్రస్తావిస్తూ… తెలుగు సినిమా ఖ్యాతిని సగర్వంగా చాటిచెప్పిన ‘రాజమౌళి అండ్ కో’కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక, అసలు స్పెషల్ ట్వీట్స్ పవన్ కళ్యాణ్ నుండి వచ్చాయి. బహుశా రాజమౌళి కూడా ఈ విషయం ఊహించి ఉండరేమో గానీ… 1000 కోట్ల మార్క్ ను అందుకున్నందుకు గానూ రాజమౌళి, ప్రభాస్ మరియు చిత్ర యూనిట్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మీ హార్డ్ వర్క్, డెడికేషన్ ఇలాంటివి సాధించడానికి కారణమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు పవన్. అలాగే రానాకు మరియు ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు పవన్.
సోషల్ మీడియా అంతా ఆదివారం నాడు ఇదే టాపిక్. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేసారు. అయితే రాజమౌళి మాత్రం ఈ ఇద్దరూ ట్వీట్లకే స్పందించారు. పవన్ చేసిన ట్వీట్ కు ‘థాంక్ యు వెరీ మచ్ సర్’ అంటూ స్పందించిన రాజమౌళి, ప్రిన్స్ విషయంలో మాత్రం కాస్త చొరవతో ‘థాంక్ యు మహేష్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో మహేష్, పవన్ ల ట్వీట్లు రాజమౌళికి కూడా స్పెషలే అన్న విషయం అర్ధమైంది. హీరోలు డామినేట్ చేసే ఇండస్ట్రీలో ఒక ‘డైరెక్టర్ బ్రాండ్’గా శిఖరాగ్ర స్థాయికి ఎదిగినా, తన ఔన్నత్యాన్ని మాత్రం రాజమౌళి ఎక్కడా కోల్పోలేదని ఈ సందర్భంగా చాటిచెప్పాడు.
The last time, Pawan Kalyan delivered a good theatrical experience to a reasonable extent was…
Nimrit Kaur is redefining raw ethnic elegance with an earthy, unapologetically sultry photoshoot that is…