Telugu

బర్త్ డే నాడు.. రోజంతా పవన్ నామస్మరనే

రేపు సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులందరికీ ఒక రకంగా పండుగ రోజు అనే చెప్పుకోవాలి. కరోనా కారణంగా జరగలేదు గానీ లేకపోతే ఈ పాటికి పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా… వకీల్ సాబ్ విడుదల అయ్యేది. అయితే రేపు పవన్ కళ్యాణ్ సినిమాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ బిజీగా ఉండబోతున్నారు.

మొట్ట మొదటిగా ఉదయం 9 గంటలకు వకీల్ సాబ్ అప్డేట్ ఉంటుంది. నిర్మాతలు చెప్పనప్పటికీ రేపు చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదల చేస్తారని సమాచారం. మధ్యాహ్నాం 12 గంటలకు క్రిష్ దర్శకత్వంలోని పవన్ తదుపరి చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చెయ్యబోతున్నారట.

ADVERTISEMENT

ఈ చిత్రం తాత్కాలికంగా ఆపేసి ఈలోగా క్రిష్ మరో సినిమా షూటింగ్ మొదలుపెట్టేసాడు. చివరిగా సాయంత్రం నాలుగు గంటల ఐదు నిముషాలు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా అప్డేట్ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్బస్టర్ సినిమా ఇచ్చిన దర్శకుడు కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూడు అప్డేట్లతో పాటు పవన్ కళ్యాణ్ రేస్ గుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి కలియకలో రాబోతున్న కొత్త సినిమా ప్రకటన ఉంటుందని కూడా సమాచారం. అయితే దాన్ని ఇప్పటివరకూ అధికారికంగా దృవీకరించలేదు. మొత్తానికి అభిమానులకు బర్త్ డే నాడు.. రోజంతా పవన్ నామస్మరనే.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

IPL: GT Into Final! Riyan Behind RR’s Elimination?

Gujarat Titans entered the IPL 2026 final after defeating Rajasthan Royals by seven wickets in…

5 hours ago

Sandeep Reddy-Prabhas: Distraction Or Diversion?

Sandeep Reddy Vanga is one of the most celebrated film makers of this generation and…

5 hours ago