
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి తిరిగివచ్చారు. ఈపాటికే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా.. వకీల్ సాబ్ విడుదల కావాల్సి ఉండగా అది కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు. ఇది ఇలా ఉండగా…. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే జరగనుంది.
ఇంత అనిశ్చితి మధ్య పవన్ కళ్యాణ్ రెండు సినిమాల బృందాలు ఆ రోజున ఎమన్నా స్పెషల్స్ విడుదల చేస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యే అవకాశం ఉందని వారు అంచనా చేస్తున్నారు. ఎప్పుడో విడుదల చేసిన రెండు పోస్టర్లు, ఒక పాట తప్ప వకీల్ సాబ్ కి సంబంధించినవి ఏవీ విడుదల కాలేదు.
అయితే ఆ సినిమా సంక్రాంతికి గానీ విడుదల అయ్యే అవకాశం లేదు. దానితో ఇన్ని నెలల ముందు టీజర్ విడుదల చేస్తారా అనేది చూడాలి. మరోవైపు… పవన్ కళ్యాణ్ – క్రిష్ సినిమా టీం ఆ సినిమా టైటిల్ ప్రకటించి… దానికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల చేస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది.
ఆ సినిమా పై అనేక వదంతులు వినిపిస్తున్నాయి. దీనితో టైటిల్ లోగో విడుదల చేస్తే ఆ వందతులకు చెక్ చెప్పవచ్చు. దానితో అది జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇలా ఉండగా.. అక్టోబర్ కు ముందు ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని తెలుస్తుంది.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…