
వకీల్ సాబ్: వేటకెళ్ళేటప్పుడు చిరుతపులి కళ్ళు
పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఫిలిం.. వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ ఈరోజు విడుదల చేశారు. సినిమా కథ ప్రకారం పవన్ కళ్యాణ్ లాయర్ గెట్ అప్ లో సీరియస్ గా చూస్తున్న స్టిల్ విడుదల చేశారు. సహజంగా పవన్ కళ్యాణ్ ని జాలీ గా చూడటానికి ఇష్టపడతారు… అయితే కథానుగుణంగా అది కుదరదు. పోస్టర్ కు హైలైట్ పవన్ కళ్యాణ్ కళ్ళు. అదేదో సినిమాలో చెప్పినట్టు… వేటకెళ్ళేటప్పుడు చిరుతపులి కళ్లలా ఉన్నాయని అభిమానులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా:
పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక పీరియడ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కేవలం 15 రోజుల షూటింగ్ తరువాత కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ చిత్రంలోని ప్రీ-లుక్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఒక పీరియడ్ గెట్ అప్ లో పవన్ కళ్యాణ్ ని ఊహించుకోవడమే ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ గా ఉంది. ఈ సినిమా కోసం వారు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి క్రిష్ మాట్లాడుతూ.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది,” అని చెప్పడం విశేషం.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన:
పవన్ కళ్యాణ్ సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కంబినేషన్ లో కొత్త సినిమా ప్రకటించారు. గతంలో జనసేన కోసం విస్తృతంగా పని చేసిన రామ్ తాళ్లూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ మధ్య కాలంలో పవన్ స్టార్ అండ్ మాస్ డైరెక్టర్లతో పని చెయ్యడం లేదు. దానితో ఈ సినిమా పై మెగా అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పోస్టర్ లో ఒక బైక్ మీద పెద్ద బాలశిక్ష ఉంది. అలాగే పోస్టర్ మీద సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు కూడా ఉండటం గమనార్హం. థిస్ టైం ఇట్ ఐస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనే కాప్షన్ బట్టి సినిమాలో మంచి మెసేజ్ ఉంటుందని కూడా అర్ధం అవుతుంది. సినిమాలో పవన్ రెబెల్ కారెక్టర్ లో కనిపిస్తాడని అంచనా. మొత్తానికి ఈ పోస్టర్ సినిమా మీద అంచనాలు పెంచేలా ఉందని చెప్పుకోవచ్చు.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…