
అయితే దానికి పవన్ కళ్యాణ్ ను సానుకూల స్పందన రాలేదని సమాచారం. అయితే రాష్ట్రానికి విభజన నాటి ప్రమాణాలు పూర్తి చెయ్యడం, ప్రత్యేక హోదాకు సరైన ప్రత్యుమ్న్యాయం చూపించగలిగితే మాత్రం పొత్తుకు తాము సిద్ధమని పవన్ కళ్యాణ్ రామ్‌మాధవ్ కు చెప్పినట్టు సమాచారం. బీజేపీని రెండు తెలుగు రాష్ట్రాలలో నాయకత్వ లేమి పట్టి పీడిస్తుంది. పార్టీని నడిపించి ప్రజలను ఆకట్టుకోగల నాయకుడు లేకపోవడం వల్ల నష్టపోతున్నామని కమలనాథుల భావన.
దాని కోసమే వారు పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. అయితే గతంలో టీడీపీతో పొత్తు వల్ల రాష్ట్రంలో బలపడలేదు కాబట్టి జనసేనను విలీనం చేసుకోవాలని వారు భావిస్తున్నారు. ఇటీవలే ఎన్నికలలో జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు వచ్చింది. పవన్ కళ్యాణ్ సైతం తాను పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఓడిపోయారు. దీనితో ఆ పార్టీ మనుగడ కష్టమని దీనితో ఎప్పటికైనా తమ దారికి రావాల్సిందే అని బీజేపీ హై కమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. భవిష్యత్ రాజకీయపరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.
Kiara Advani has once again become a major topic of discussion on social media. While…
Aarti Chikara is redefining summer glamour with her latest poolside revelation. Draped in a vibrant…