
త్రివిక్రమ్ తో ఎలా అయితే పవన్ కు సత్సంబంధాలు ఉన్నాయో, విక్టరీ వెంకటేష్ కు కూడా అదే స్థాయిలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ – త్రివిక్రమ్ కాంబో ఎలాగో, రచయితగా ఉన్న కాలంలో వెంకీ – త్రివిక్రమ్ ల కాంబో కూడా అదే మాదిరి ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అదే సాన్నిహిత్యం ఉన్న విషయం పలు సినీ వేడుకల ద్వారా స్పష్టమైంది. దీంతో ఈ అనుబంధంతోనే విక్టరీ వెంకటేష్ కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు విచ్చేయనున్నారని సమాచారం.
జూనియర్ ఎన్టీఆర్ తరపున అన్న నందమూరి కళ్యాణ్ రామ్ మరియు హరికృష్ణ హాజరు కానుండగా, త్రివిక్రమ్ తరపున పవన్ కళ్యాణ్ మరియు విక్టరీ వెంకటేష్ లు అతిధులుగా విచ్చేయనుండడంతో ఈ సినిమాపై హంగామా అప్పుడే ప్రారంభమైంది. ఈ సమాచారం తెలుసుకున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు. మొత్తానికి జూనియర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన కాంబో అదిరిపోయే రీతిలో ప్రారంభం కాబోతోందన్న మాట.
Anil Ravipudi’s comments at the Irumudi success meet have opened up an interesting debate about…
చిత్రం: ఎపిక్ M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 11, 2026 తారాగణం: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య,…