
అయితే బన్నీ మాదిరి ‘మాట్లాడను బ్రదర్’ అని చెప్పకుండా… ‘కొంచెం సేపు ఆగండి… మాట్లాడతాను… తప్పకుండా…’ అంటూ నితిన్ వివాదాలకు జోలికి వెళ్ళకుండా ప్రసగించారు. సినిమా గురించి చెప్తున్న తరుణంలో మళ్ళీ పవన్ ఫ్యాన్స్ నుండి అలాంటి డిమాండ్లే రావడంతో… చివరకు పవన్ ను ప్రశంసలతో ముంచెత్తడం, అభిమానుల కోలాహలం ఒక్కసారిగా జరిగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ అంటే సహజంగా ఇష్టపడే నితిన్, ‘అ…ఆ…’ ఆడియో వేడుకకు విచ్చేసి ఆశీర్వదించిన తన అభిమాన హీరో గురించి మాట్లాడడం ఆశించిన అంశమే.
కానీ, ఇటీవల జరిగిన బన్నీ ఉదంతం నేపధ్యంలో కొందరు పవన్ అభిమానులు ఏ మాత్రం వాటిని లెక్కచేయకుండా వ్యవహరించడం అనేది గమనించదగ్గ విషయం. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏమిటంటే… నితిన్ మాట్లాడేటంత వరకు సంయమనం పాటించారు. పవన్ ఫ్యాన్స్ సందడి చూసిన త్రివిక్రమ్, కాస్త తెలివిగా వ్యవహరించి తప్పించుకున్నారు. తన ప్రసంగం ముగిసే సమయంలో పవన్ అభిమానుల నుండి కామెంట్లు విన్న త్రివిక్రమ్… అందరికీ కృతజ్ఞతలు చెప్పి ముగించారు.
అయితే గతంతో పోలిస్తే… బన్నీ ఉదహరించినట్లుగా ‘ఆ కొందరు పవన్ ఫ్యాన్స్ ప్రవర్తన’ చాలా మెరుగు అన్న భావనే సర్వత్రా వ్యక్తమైంది. బహుశా బన్నీ చేసిన ‘ఉపదేశం’ వలన గానీ లేదంటే తమ తప్పులు తెలుసుకున్నారో గానీ, ఒక్క నితిన్ ను తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. దీంతో మిగిలిన సభ్యులు ‘అ…ఆ…’ సినిమా గురించి, వారి అనుభూతులను, చిత్ర యూనిట్ సభ్యులకు కృతజ్ఞతలను సంతృప్తిగా చెప్పుకున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…