
రామచంద్రాపురం మండలం, వెల్లసావరానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే పవన్ అభిమాని, కాకినాడ సభకు వచ్చి చెట్టు కొమ్మపై కూర్చుని తిలకిస్తున్న సమయంలో… ఒక్కసారిగా జారి క్రింద పడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో వెన్నెముక, కాళ్ళకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో కాకినాడ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసారు. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న సుబ్రహ్మణ్యం, ఇటీవలే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి, ఇంటికి చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యంకున్న ఆర్ధిక సమస్యలు తెలుసుకున్న ద్రాక్షారామం, తోటపేటకు చెందిన పవన్ అభిమానులు, అతని ఇంటికి వెళ్లి 20,000 రూపాయలను ఆర్ధిక సాయంగా అందజేసారు. పవన్ కు సంబంధించిన ఏ చిన్న సంఘటన జరిగినా, ముందుండే అభిమాన గణం, తమ తోటి అభిమాని ఇబ్బందుల్లో ఉన్నపుడు ఇలాంటి ఆర్ధిక సాయం విషయంలోనూ ముందుకు వచ్చి, తోచినంత అందివ్వడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…