
“మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ… మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చచ్చినంత ఒట్టు… మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌరవం తగ్గిపోతుంది… పవన్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వదిన అంటాం… మీ నిర్ణయంతో అందరూ బాధపడే అవకాశం ఉంది…” అంటూ ఒకటేమిటి రకరకాలుగా ఫేస్ బుక్ వేదికగా పవన్ మాజీ సతీమణి రేణుకు ఉచిత సలహాలతో కూడిన హెచ్చరికలు చేస్తూ హంగామా చేస్తున్నారు.
తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణు చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఆమె వ్యక్తిగత విషయంలో కలగజేసుకుని చేస్తున్న కామెంట్లు ఇవి. దీంతో ఆగ్రహించిన రేణూ దేశాయ్… ఈ కామెంట్లు కేవలం తనను ఉద్దేశించినవేనని తాను అనుకోవడం లేదని, అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామని అదే ఫేస్ బుక్ వేదికగా మండిపడ్డారు.
“ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?’ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రేణు, ఒక వైపు మహిళల సమానత, సాధికారత, అత్యాచారాల నుంచి మహిళలకు రక్షణ వంటి అంశాలపై ప్రసంగాలు చేస్తూనే… మగవారు మరోవైపు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చెప్పింది. తాను ఏడేళ్లు ఒంటరిగా ఉండి, ఇప్పుడు తనకు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండునని అనిపించిందని చెప్పానని తెలిపింది.
ఒక అమ్మాయి మరో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా? తాను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అని ప్రశ్నించింది. అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలు వారి కుమారులను పద్ధతిగా పెంచాలని తాను ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని ఈ సందర్భంగా తెలిపింది. పర్సనల్, పబ్లిక్ అన్న తేడా లేకుండా ప్రతి అంశంలోనూ రచ్చ చేస్తున్న పవన్ అభిమానుల తీరు అనేక శేషప్రశ్నలను మిగులుస్తోంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…