Telugu

నమ్మలేం దొరా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి అప్ డేట్ కోసం పవన్ అభిమానులు ఒకప్పుడు ఆశగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ నుంచి తాజా వార్త అంటూ ఏదైనా ఒక వార్త బయటకొస్తే పవన్ అభిమానులలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలయ్యిందో చెప్పడం కష్టమే కానీ ఎప్పుడు విడుదల కాబోతుందో చెప్పగలం అనుకున్న వారిని సైతం ఈ చిత్రం విడుదల తేదీ భయపెడుతుంది. ఇప్పటికి ఎన్నో విడుదల తేదీలను మార్చుకుంటూ తాజాగా మే రెండు లేదా మూడో వారానికి హరిహర వీరమల్లు విడుదలకు సిద్దమయ్యింది అంటూ సోషల్ ఒక వార్త వైరల్ అవుతుంది.

ADVERTISEMENT

అయితే ఈ అప్ డేట్ పై మెగా అభిమానులు ‘మేము నమ్మలేం దొర’ అంటూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పటికే పవన్ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ విడుదల తేదీలు ఇప్పుడు అదే అభిమానుల నిరాశకు కారణమవుతున్నాయి. పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడం, దానికి తోడు తాజాగా ఆయన కుమారుడు మార్క్ శంకర్ కు అనుకోని ప్రమాదం ఎదురవ్వడం,

ఈలోగా పవన్ అనారోగ్యం బారిన పడడంతో ఆఖరి దశలో ఉన్న ఈ చిత్ర షూటింగ్ కాస్త మరోసారి వాయిదా పడింది. దీనితో మార్చ్ నుంచి ఏప్రిల్ కు ఏప్రిల్ నుంచి ఇప్పుడు మే నెలకు విడుదల తేదీలను మార్చుకుంటూ గమ్యం ఎరుగని ప్రయాణం చేస్తుంది హరిహర వీరమల్లు.

అయితే ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడువులైన ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా సాధరణ ప్రేక్షకులనే కాదు పవన్ అభిమానులను కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇప్పటికే ఈ చిత్రం పై అటు సినీ వర్గాలలో కానీ ఇటు ప్రేక్షకులలో కానీ అంచనాలు పూర్తిగా నీరుగారిపోయాయి.

అయితే పవన్ ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే సుజిత్ OG మూవీ షూటింగ్ మొదలవుతుందని ఆశ పడుతున్న మెగా అభిమానులకు ఆ శుభవార్త చెవినపడెప్పుడో.? తెలియడం లేదు. అయితే పవన్ OG చిత్రం పై మాత్రం ఇప్పటికి అభిమానులలో అంచనాలు ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. పవన్ రాజకీయ సభలు నిర్వహించే చోట కూడా ఆయన అభిమానులు OG, OG అంటూ పవన్ ను వెంటాడుతున్న దృశ్యాలు కోకోల్లలుగా దర్శనమిస్తున్నాయి.

మరి ఈసారైనా అనుకున్న తేదికి హరిహర వీరమల్లు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తుందా.? లేక మరో వాయిదా తీర్మానంతో వెనకడుగు వేస్తుందా అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

9 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

38 minutes ago