Telugu

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటే అర్దం

జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఇవాళ్ళ మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడినంటూ వైసీపీ నేతలు తరచూ విమర్శిస్తుంటారు. వారిలాగ నా దగ్గర బ్లాక్ మనీ లేదు కనుక నా పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం సినిమాలు చేస్తున్నాను తప్ప డబ్బు పోగేసుకోవాలని కాదు.

నేను వేరే పార్టీ (టిడిపి, బిజెపి)లను ఏపీలో అధికారంలో తెచ్చేందుకే రాజకీయాలలోకి వచ్చానని ఆరోపిస్తున్నారు. ఎవరైనా మనమే అధికారంలోకి రావాలని కోరుకొంటారు కానీ వేరే పార్టీ రావాలని కోరుకోరు కదా?నేను కూడా మా పార్టీ అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకొంటున్నాను.

ADVERTISEMENT

అనాడూ మీరు (జగన్మోహన్ రెడ్డి) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏపీ పోలీసులు, అధికారులు, వైద్యులపై నమ్మకం లేదని అన్నారు. నేటికీ వారి పట్ల మీ వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించేస్తూ గొప్పగా పాలన సాగలంటే ఎలా సాధ్యం?

మేము అధికారంలోకి వస్తే నిజాయతీపరులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించి రాష్ట్రంలోని వ్యవస్థలను మళ్ళీ బలోపేతం చేస్తాము. ప్రభుత్వం మారిన ప్రతీసారి వ్యవస్థలను మార్చడం సరికాదు. అలాగే వృద్ధులు, నిసహాయులు, నిరుపేద ప్రజలకు సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే మిగిలినవారిని తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ఉత్తమమని భావిస్తున్నాను.

ఇక పదవులు, అధికారం కోసం నేను ఎప్పుడూ వెంపర్లాడలేదు. పదవులే కావాలనుకొంటే నేరుగా ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఏదో పదవి అడిగి తీసుకోగలిగే చనువు నాకుంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా నివారించాలనే నా మాటకు వైసీపీ పెడర్ధం తీసి వక్రభాష్యాలు చెపుతోంది. అసలు నేను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికి కారణం మీ ప్రభుత్వ అనుచిత నిర్ణయాలు, విధానాలు, వైఖరే కారణం. మీ ప్రభుత్వం సరిగా పనిచేస్తుంటే నేను రాజకీయాలలోకి కొనసాగవలసిన అవసరమే ఉండేది కాదు కదా?” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Vishwak’s #CULT Trailer: Thrills n Chills

Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…

8 minutes ago

Spirit Poster Trolls: Deepika Fans Target Vanga Again?

Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…

56 minutes ago