‘జనసేన’కు అండగా మేమంతా ఉన్నాం!

సినీ హీరోలు రాజకీయ పార్టీలు స్థాపించేది అభిమానుల అండ చూసుకునే! అప్పుడు ఎన్టీఆర్ ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించినా.., చిరంజీవి ‘ప్రజారాజ్యం’ను నెలకొల్పినా.., పవన్ కళ్యాణ్ ‘జనసేన’ ఏర్పాటు చేసినా… అశేష అభిమానుల మద్ధతు అంచనా వేసుకునే! అయితే ఎన్టీఆర్ విషయంలో అభిమానులు అందించిన సహకారం చిరు, పవన్ విషయాలకు వచ్చేసరికి ముఖం చాటేశారు. ముఖ్యంగా చిరు విషయంలో నిర్మొహమాటంగా తిప్పికొట్టారు. ఫ్యాన్స్ మద్ధతు కోరిన ఎన్టీఆర్ అప్పట్లో పెద్ద ఎత్తున అభిమానులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. కానీ, చిరు విషయంలో అది పక్కదారి పట్టడంతో రాజకీయంగా ఫ్యాన్స్ అండ కోల్పోయారు మన మెగాస్టార్. ఇప్పటివరకు అసలు ఎన్నికల బరిలోకి దిగకుండా పరోక్షంగా పవన్ కూడా అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపరిచారు.

ADVERTISEMENT

ఈ పరిణామాల నేపధ్యంలో పవన్ ‘జనసేన’ పార్టీ రెండవ వ్యవస్థాపక రోజు రానుంది. దీంతో మార్చి 14వ తేదీన ‘జనసేన’ పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై విశాఖ సిటీవైడ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆదివారం నాడు భేటీ అయ్యి పలు కీలక ప్రకటనలు చేసారు. ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ కు అండగా ఉంటామని, పార్టీని దిగువ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు గాను విశాఖపట్టణం జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.

సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ‘జనసేన’ పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావ సభలను భారీ ఎత్తున నిర్వహించాలని, పవన్ లక్ష్యాలుగా నిర్దేశించబడిన జాతీయ సమైక్యత, ప్రజాధనం వ్యయానికి కాపలా, బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు. బహుశా పవన్ అయినా తన పార్టీని పట్టించుకుంటున్నారో లేదో గానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం ‘జనసేన’ను నెత్తికెత్తుకుంటున్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అభిమానుల నుండి ఈ రేంజ్ లో మద్ధతు లభిస్తున్నా పవన్ మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడం లేదన్న కామెంట్స్ రాజకీయ విస్లేశాకుల నుండి కూడా వ్యక్తమవుతున్నాయి.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

6 hours ago