
ఆ క్రమంలోనే పవర్ స్టార్ తాజా సినిమా “కాటమరాయుడు”కు సంబంధించిన టైటిల్ సాంగ్ ను సోషల్ మీడియాలో లీక్ చేసారు. అయితే ఇది నిజంగా సినిమా కోసం రూపొందించిన పాట కాదు. ఔత్సాహికులైన పవన్ అభిమానులు, తమ అభిమానాన్ని చాటుకోవడానికి చేసిన పాట. పవర్ ఫుల్ లిరిక్స్ తో ‘కాటమరాయుడు’ టైటిల్ వచ్చేలా రూపొందించిన ఈ పాటను యూ ట్యూబ్ లో ‘లీక్’ పేరిట విడుదల చేసారు. ఈ పాట వింటే ఖచ్చితంగా సినిమా కోసం రూపొందించిన పాట కాదని ఇట్టే తెలిసిపోతుంది.
ఈ పాటను రూపొందించేటప్పుడు ఒక విషయాన్ని ఈ లీక్ రాయుళ్ళు మరిచినట్లున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అనూప్ సంగీతం అంటే చక్కగా ఆహ్లాదకరంగా, వినసొంపుగా ఉంటుంది. కానీ ‘కాటమరాయుడు’ లీక్ పేరుతో యూ ట్యూబ్ లో లీక్ చేసిన ఈ పాట సంగీతం అనూప్ మ్యూజిక్ కు ఏ మాత్రం గుర్తుకు తేకపోగా, ఏదో ఓ ప్రైవేటు పాట మాదిరి ఉంటుంది.
KVN Productions has quickly established itself as one of the ambitious production houses in South…
చిత్రం: ఐమ్ గేమ్ M9 రేటింగ్: 1.75/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: దుల్కర్ సల్మాన్, కయాడు…