
ఇటీవలే విడుదలైన ‘బాహుబలి 2’ ట్రైలర్ యూ ట్యూబ్ లో అనూహ్య రికార్డులు సృష్టించడంతో, ఆ తర్వాత విడుదల అవుతోన్న పెద్ద ట్రైలర్ గా ‘కాటమరాయుడు’ ట్రైలర్ నాన్ – బాహుబలి రికార్డులను కొల్లగొడుతుందని పవన్ అభిమానులు భావించారు. ట్రైలర్ కు స్పందన బాగానే వచ్చినప్పటికీ, ఆ ప్రభావం క్లిక్స్ రూపంలో కనిపించకపోవడం, పవర్ స్టార్ రేంజ్ ను ప్రశ్నార్ధకం చేస్తోంది.
1 మిలియన్ క్లిక్స్ ను అందుకోవడానికి ‘కాటమరాయుడు’ ట్రైలర్ కు దాదాపుగా 12 గంటల సమయం పట్టడం విశేషం. ఒకప్పుడైతే ఇదో సరికొత్త రికార్డుగా నిలిచేది. కానీ, మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ మరియు బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాల టీజర్, ట్రైలర్లకు వచ్చిన స్పందన రీత్యా… పవన్ సినిమా ట్రైలర్ కు వచ్చిన క్లిక్స్ చిన్నబోయాయి. ‘నాన్ బాహుబలి’ రికార్డుల మాట దేవుడేరుగు… కనీసం వెటరన్ హీరోల రికార్డుల స్థాయికి కూడా రాలేకపోవడం ‘కాటమరాయుడు’కున్న బజ్ ను చెప్పకనే చెప్తోందా?
Vyjayanthi Movies, the producers of Kalki 2898 AD, have issued an official warning about fake…
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…