Telugu

పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం!

ఓవైపు వరుస సినిమాలకు కాల్‌షీట్లు ఇచ్చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయ అంశాల్లోనూ బిజీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచీ కోట్ల కూడలి వరకూ పవన్ ర్యాలీ నిర్వహిస్తారు. తర్వాత కోట్ల కూడలిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్.

కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై జరిగిన 14 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పవన్ డిమాండ్ చేయబోతున్నారు. మూడు నెలల కిందట కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు ఈ కేసుపై ఆరా తీశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగకపోతే మళ్లీ ఆందోళన చేస్తానని హెచ్చరించారు.

ADVERTISEMENT

అయితే పవన్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఆయన పర్యటనకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఈ కేసుని సిబిఐకి అప్పగించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. తమ నాయకుడి దెబ్బకు ప్రభుత్వం దిగివచ్చిందని జనసైనికులు అంటున్నారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కర్నూల్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఆ తరువాత ఒక్క రోజు బ్రేక్ తీసుకుని అమరావతి గ్రామాల పర్యటనకు వెళ్తారు. మూడు రాజధానులు వ్యతిరేకంగా అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటిస్తారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

మోదీ పర్యటన: సింహాలు గాయపడ్డాయా.?

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…

27 minutes ago

South Indian Assembly: Cinema Flavour Mama!

South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…

52 minutes ago