
ఒకప్పుడు భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే హీరోగా పవన్ కళ్యాణ్ పేరు నిలిచేది. ఇప్పటికీ మొదటి మూడు, నాలుగు రోజుల కలెక్షన్స్ ను పరిశీలనలోకి తీసుకుంటే… పవన్ ఆధిపత్యం ప్రదర్శిస్తారు గానీ, ఫస్ట్ డే విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఏడు సినిమాలు అప్పటివరకు ఉన్న “ఫస్ట్ డే” కలెక్షన్స్ రికార్డులను తిరగరాశాడు. మొదటి రోజు కలెక్షన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దే అసలు ప్రభంజనం.
బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలిన “రామయ్యా వస్తావయ్యా, రభస” వంటి సినిమాలు కూడా ఫస్ట్ డేన అప్పటివరకు ఉన్న ఓపెనింగ్స్ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించాయి. అయితే రెండవ, మూడవ రోజులలో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో, వీకెండ్ కలెక్షన్స్ విషయంలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వెనుక పడిపోతున్నాడు. పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు గానీ, నెగటివ్ టాక్ వస్తే తారక్ ది “వన్ డే వండర్”గా మారింది. ఎన్టీఆర్ కున్న మాస్ అభిమానగణమే ఈ ఫస్ట్ డే రికార్డులలో కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
ఫస్ట్ డే రికార్డులలో ఎన్టీఆర్ 7 సినిమాలతో అగ్రస్థానంలో నిలువగా, ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 5 చిత్రాలతో ఉన్నారు. పవన్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ ప్రభంజనమే వేరు. ముఖ్యంగా మాస్ అభిమానులు రిపీట్ మోడ్ లో పవన్ సినిమాను చూస్తూనే ఉంటారు. ఈ ముగ్గురు హీరోలలో ‘ఫస్ట్ డే’ కలెక్షన్స్ రికార్డులలో మహేష్ ది 3వ స్థానం. ‘పోకిరి’ ముందు వరకు రికార్డులను పెద్దగా టచ్ చేయని ప్రిన్స్ కు, ఆ తర్వాత రికార్డులను సొంతం చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.
ఫస్ట్ డే విషయంలో కాస్త వెనుకబడినా… లాంగ్ రన్ విషయంలో పవన్, తారక్ లతో పోలిస్తే… మహేష్ బాబుదే పూర్తి ఆధిపత్యం. దీనికి కారణం… మహేష్ కు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్. ఈ నెలాఖరున విడుదల కానున్న “స్పైడర్” ఫస్ట్ డే రికార్డులను ఖచ్చితంగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు బల్లగుద్ది మరీ చెప్తున్నాయి. ఈ ముగ్గురి హీరోలలో పరిశీలించాల్సిన కీలక అంశం ఏమిటంటే… పవన్, మహేష్ లతో పోలిస్తే… జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ చిత్రాలలో నటించడం. దీంతో సహజంగానే 7 సినిమాలతో లీడ్ ఉన్నారు ‘యంగ్ టైగర్.’
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…
Kichcha Sudeepa needs no special introduction to the Telugu audiences. The actor’s next project has…