
అయితే, ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మరో ప్రత్యక్ష పోరాటానికి వేదిక అవుతోంది 2016 జనవరి 1వ తేదీ. నూతన సంవత్సరం కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా టీజర్ ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బరిలోకి ప్రిన్స్ మహేష్ బాబు సైతం రంగంలోకి దూకారు. అభిమానులకు నూతన సంవత్సర సందర్భంగా తన తాజా చిత్రం “బ్రహ్మోత్సవం” ఫస్ట్ లుక్ ను జనవరి 1వ తేదీన విడుదల చేయబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు గానీ, ప్రిన్స్ అభిమానులకు “బ్రహ్మోత్సవం” టీం ఓ ‘స్పెషల్’ను సిద్ధం చేస్తున్నారన్న సమాచారం ట్రేడ్ వర్గాల నుండి వ్యక్తమవుతోంది.
దీంతో మరోసారి సోషల్ మీడియాలో పవన్, మహేష్ అభిమానుల సందడి మొదలవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరో విశేషమేమిటంటే… ఈ రెండు సినిమాల విడుదల తేదీలు కూడా 2016 వేసవిలోనే ఉన్నాయి. పవన్ పక్కా మాస్ గా వస్తుంటే, మరోవైపు మహేష్ క్లాస్ గా సిద్ధమవుతున్నవాడు.
Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…
Namit Malhotra's Ramayana has taken a decent start at the Hindi box office, with Day…