Telugu

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ సినిమాపై ఇంకా దాపరికమేనా?

పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రావడం ఖాయం అయిపోయింది. బాలీవుడ్ లో హిట్టయిన పింక్ రీమేక్ లో ఆయన నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. మొన్నే ఆ సినిమా ముహూర్తం కూడా చేసుకుంది. థమన్ సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయని దిల్ రాజు ప్రకటించారు. అయితే సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో అని మాత్రం దిల్ రాజు ప్రకటించలేదు.

థమన్ మాత్రం ఇండైరెక్టుగా పవన్ కళ్యాణ్ హీరో అన్నట్టు చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంగా మాట్లాడకపోవడం విశేషం. ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ను తన కమ్ బ్యాక్ సినిమా గురించి అడిగితే ఆయన కూడా డైరెక్టుగా సమాధానం చెప్పలేదు.

ADVERTISEMENT

“సినిమా ప్రతిపాదనలు కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అయినా ఒక్కోసారి నటుడి తాలూకు మానసిక స్థితిని దాటేశానేమో అనిపిస్తుంటుంది. (నవ్వేస్తూ…) అయినా, నా సినిమాల గురించి ఎందుకు… రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. నా ఆలోచన సామాన్య ప్రజల కోసం ఏదైనా చేయాలనే దాని మీదే తిరుగుతోంది,” అని చెప్పుకొచ్చారు.

కారణమేదైనా పవన్ కళ్యాణ్ సినిమాలలోకి రావడం ఖాయం. అది తప్పనప్పుడు ఇంక దానిగురించి దాచడం ఎందుకు? ఈరోజు కాకపోయినా రేపైనా చెప్పాల్సిందే. అదే సమయంలో తనకు సినిమాల మీద ఇంట్రెస్టు లేదు అనడం తనతో సినిమాలు తీసేవారిని, ఆ సినిమాలు చూసే వారిని అవమానించినట్టే కదా? కావున ఆ మాట కూడా మానేస్తే మంచిది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Koratala Siva Launches Nara Rohith’s RN23

Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…

11 minutes ago

దక్షిణాది భవిష్యవాణి..లోకేష్ – జగన్, రేవంత్ – కేటీఆర్, విజయ్ – ఉదయనిధి.?

దక్షిణ భారతంలో భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయాలు అన్ని కూడా ఒకే నావలో పయనించే ప్రయాణికుల మాదిరి కనిపిస్తున్నాయి.…

12 minutes ago