Telugu

అడ్డబొట్టు పెట్టుకుని… పంచె కట్టుకుని… పవన్ నడుస్తుంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాకతో “అ…ఆ…” సినిమా ఆడియో వేడుకకు ఎక్కడ లేని కళ వచ్చిపడింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. అయితే అనుపమ వేదికపై విచ్చేసిన సమయంలో పవన్ కళ్యాణ్ గురించి చేసిన పలు వ్యాఖ్యలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపగా, వాటికి మురిసిపోతూ నవ్వుకోవడం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతయ్యింది.

“పవన్ కల్యాణ్ సర్ ను కలవడం ఇదే తొలిసారి అని, మీరు మలయాళంలో నటించొచ్చు కదా? మీరు మలయాళంలో నటిస్తే చూడాలని ఉందని” అనుపమ చేసిన వ్యాఖ్యలకు… ‘అబ్బే వద్దు…’ అంటూ పవర్ స్టార్ సైగ చేసారు. ఆ తర్వాత మైక్ అందుకున్న యాంకర్ సుమ… అవును నిజమే… పవన్ కల్యాణ్ నుదుట అడ్డబొట్టు పెట్టుకుని… పంచె చేతితో పట్టుకుని నడుస్తుంటే… అనగానే ఎదురుగా ఉన్న పవన్ కల్యాణ్ తనదైన శైలిలో పగలబడి నవ్వేశారు. అలా పవర్ స్టార్ ను నవ్వుల్లో ముంచెత్తింది అనుపమ, సుమల మాటలు.

ADVERTISEMENT

ఇక, చిత్ర యూనిట్ గురించి మాట్లాడిన అనుపమ… తాను నటించిన తొలి సినిమా మంచి విజయం సాధిస్తుందని, తనతో కలిసి పని చేసిన సమంత, నితిన్ లు ఎంతో సహకరించారని, దర్శకుడు త్రివిక్రమ్ ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారని చెప్పుకొచ్చింది. హోమ్లీ లుక్ లో ఉన్న అనుపమపై దర్శకుడు త్రివిక్రమ్ కూడా ప్రశంసలు కురిపిస్తూ చాలా కాలం చూసే నటిగా అభివర్ణించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

TFPC Election Results 2026: C Kalyan’s Mana Panel Scores Big Win

The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…

10 minutes ago

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

38 minutes ago