
తాజాగా ఇదే ఆర్ధిక స్తోమతను ఉద్దేశిస్తూ పవన్ పై ఓ విషయం హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ అత్యంత ప్రీతిపాత్రంగా కొనుగోలు చేసిన వాహనాలలో మెర్సిడెజ్ బెంజ్ కారు కూడా ఒకటి. ఆకర్షణీయమైన ఈ కారు అంటే పవన్ కు ఎంతో ఇష్టమని సినీ వర్గాలు చెప్పుకుంటూంటాయి. అయితే తన కొత్త సినిమా ఖర్చుల నిమిత్తం, ఈ మెర్సిడెజ్ బెంజ్ కారును పవన్ అమ్మేశారని, దీంతో వచ్చిన సొమ్మును, తాజా చిత్రానికి పెట్టుబడిగా పెడుతున్నారని వచ్చిన వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి.
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిలిచిన నేపధ్యంలో ఈ సినిమా నష్టాలను పవన్ కొంతమేరకు సర్దుబాటు చేసారని, అందులకే శరత్ మరార్ తో వెంటనే మరొక సినిమాకు కమిట్ అయ్యారని ఈ వార్తల వెనుక ఉన్న ప్రచారం. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నాయో గానీ, పవర్ స్టార్ తన ప్రీతిపాత్రమైన కారు అమ్మేసాడన్న విషయం పట్ల పవర్ స్టార్ ఫ్యాన్స్ నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
Karthi is returning to the silver screen with the highly anticipated spy thriller Sardar 2,…
Directed by Venu Gopal Reddy, Romanchakam features Sumanth Prabhas and Ananthika Sanilkumar in the lead…