
సామాన్యులకు అందని పదాలు వాడుతూ పోస్టులు చేయడాన్ని తప్పుబట్టింది. ఏం పని లేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆక్షేపించింది. చరిత్రకు, ఈ పేరుకు పొంతన ఎక్కడుందని నిలదీసింది. ఇక స్వతహాగా పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన తన కుమార్తె వ్యాఖ్యలను ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేసిన వర్మ సమాధానాన్నీ ఇచ్చాడు.
నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదని రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరి కంటే పవన్ కళ్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. ఈ సంభాషణను తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.
అంతకుముందు వర్మ ట్వీట్ చేస్తూ… ఈ ప్రపంచంలో క్రైస్తవం పుట్టక ముందు నుంచి, అసలు మానవులు మాట్లాడుకోగలరా అని ఈజిప్టుకు చెందిన పారా సమెథికస్-1 పరిశోధనలు చేసిన కాలం నుంచి వెతికినా, ఇప్పటివరకూ వినని పేరును తానిప్పుడు విన్నానని, భాషలు పుట్టిన తరువాత తాను విన్న పేర్లలో అత్యంత గొప్పది ఇదేనని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు.
నేడు రాష్ట్రమంతటా జరుగుతున్న పోలింగ్ ఒక ఎత్తు అయితే పులివెందుల పోలింగ్ ఒక్కటీ మరో ఎత్తు అన్నట్లు సాగుతోంది. ఎక్కడికక్కడ…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి “చొక్కా మడత పెడతా.. పులివెందులలో ఓటు వేస్తా... ఎవరు అడ్డుకుంటారో అడ్డుకోండి చూస్తానంటూ..” రెండు…