
జనసేన పార్టీ వర్గాలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ధృవీకరించిన ఈ విషయం, ఎప్పటినుండి ప్రసారం అవుతుందో అన్నది మాత్రం తేలాల్సి ఉంది. బహిరంగ సమావేశాలలో మాట్లాడుతూ మాట్లాడుతూ… ఊగిపోయే పవన్ కళ్యాణ్, ఇకపై బుల్లితెరపై ఊగిపోవడానికి, తన అభిమానులను ఊపేయడానికి సిద్ధమవుతున్నాడన్న మాట. అయితే సోషల్ మీడియాలో ఈ షోపై అప్పుడే భిన్న వాదనలు మొదలయ్యాయి.
పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఎక్కువ శాతం రీమేక్ సినిమాలు కాగా, ఇప్పుడు ఈ షో కూడా రీమేక్ యేనా? అన్న విమర్శలు ఓ పక్కన వినిపిస్తుండగా, రాజకీయాల ద్వారా ఏమీ చేయలేకపోతున్నా, కనీసం ఈ షో ద్వారా అయినా ప్రజలకు ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆశించే వారున్నారు. మరి ఈ షోను ఎలా ముందుకు తీసుకువెళ్తారో, తన రాజకీయ జీవితానికి ఎలా అనుకూలంగా మలచుకుంటారో గానీ, ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
After films like The Girlfriend, Chennai Love Story, and Couple Friendly, producer Dheeraj Mogilineni brings…
Tamil cinema has found an extremely talented youngster in the form of Pradeep Ranganathan, who…