Telugu

“పీకే లవ్” అన్న పూనం!

ఎప్పుడైతే ఎవరికీ తెలియని ఒక విషయం బయటకు వస్తుందో…. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా, ముందుగా అది ఒక సెన్సేషన్ గా మారుతోంది. ఆదివారం నాడు కత్తి మహేష్ లేవనెత్తిన పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ ల బంధం కూడా ఇలాగే మారింది. దీంతో ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం హైలైట్ గా సాగుతోంది. అభిమానులు, దురభిమానులు మాటలు ఎలా ఉన్నా… మెగా వర్గానికి అండదండలుగా ఉండే బన్నీ వాసు లాంటి వారు చేసిన కామెంట్స్ ప్రకారం అయితే… పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ ల మధ్య స్నేహపూర్వకమైన బంధం ఉందన్న విషయం స్పష్టమైంది.

ADVERTISEMENT

“ఎలాంటి బంధుత్వం లేకుండా ఒక మహిళకు సహాయపడితే, అది ఏదో చెప్పకూడని బంధం ఉన్నట్లుగానే భావించాలా? ఎదగండి బాబు” అంటూ ఫేస్ బుక్ వేదికగా చేసిన కామెంట్స్, కత్తి మహేష్ కు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఉన్నప్పటికీ, పూనం కౌర్ కు పవన్ కళ్యాణ్ సహాయపడిన అంశం తేటతెల్లమైంది. అంటే కత్తి మహేష్ లాజికల్ గా ప్రశ్నించినట్లు… ఏదొక అనుబంధం అయితే వీరిద్దరి మధ్య నెలకొందన్న విషయం అందరికీ తెలిసి వచ్చింది. ఇక బన్నీ వాసు లాంటి వారిని పక్కన పెడితే, ఎవరి గురించి అయినా ఓ సెన్సేషన్ విషయం బయటకు వస్తే… వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ను వెలికితీసి ఎండగట్టడం ప్రస్తుతం నెటిజన్లు చేస్తోన్న పని.

దీంతో పూనం కౌర్ కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ లను వెలికితీసి “పీకే లవ్” అంటూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున చేసిన కామెంట్స్ తదితరాలను బయటకు తీసుకువస్తున్నారు. ఇలా ఒకటేమిటి సోషల్ మీడియా అంతా… పూనం కౌర్ గతంలో చేసిన ట్వీట్లను రీ ట్వీట్లు చేస్తూ… ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. మరో అవకాశం వచ్చిందని ప్రత్యర్ధులు ఎండగట్టే పనిలో ఉండగా, అటు పూనం కౌర్ నుండి గానీ, ఇటు పవన్ వర్గం నుండి గానీ ఎలాంటి బదులు రాకపోవడంతో… డిఫెన్స్ లో పడడం పవన్ అభిమానుల వంతయ్యింది. వీటన్నింటికి మించి మెగా కాంపౌండ్ అభిమానిగా చెప్పుకునే బన్నీ వాసు పరోక్షంగా చేసిన కామెంట్స్ వీటిని ధృవీకరిస్తున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

బూతులు కూడా తిట్టారటగా.. సగం సగం చెప్తే ఎలా సాయి?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…

19 minutes ago

Dhurandhar Ruined Spy Universe: Is Karthi Next in Line?

Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…

26 minutes ago