Telugu

పాఠశాలలో భద్రత పై చర్చ…మేలుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందా.?

రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన వస్తువుతో ఏకంగా నేరుగా తరగతి గదిలోకి వెళ్లిపోవడం ఎలా సాధ్యమయ్యింది.? అసలు ఆ రంపం పట్టుకుని సదరు వ్యక్తి నేరుగా తరగతి లోకి ప్రవేశించి తానూ అనుకున్న పని ధైర్యంగా చేసి వెళ్లగలిగాడు అంటే లోపం ఎక్కడుంది.?

కళ్ళ ముందే తోటి విద్యార్థి రక్తపుమడుగులో మృత్యువుతో పోరాడుతున్న దృశ్యాలు చూసిన చిన్నారులు రేపటి రోజున ధైర్యంగా అదే తరగతి గదిలో అడుగుపెట్టగలరా.? తల్లితండ్రులు తమ బిడ్డల భద్రత పై భరోసా ఉంచి పాఠశాలకు పంపగలరా.?

ADVERTISEMENT

ఒక్క రాప్తాడు ఘటన మాత్రమే కాదు హరియాణా స్కూల్ లో 8 ఏళ్ళ చిన్నారి 6 ఏళ్ళ బాలిక మీద జరిపిన దాడి ఘటన కూడా విద్యార్థుల తల్లితండ్రులను ఆలోచనలో పడేస్తుంది. బడికి పంపుతున్న తమ పిల్లలు స్కూల్ లో సేఫ్ ఉంటున్నారా.? వారికీ అక్కడ భద్రత లభిస్తుందా.?

ఇన్నాళ్లు తమ పిలల్లు ఒంటరిగా రోడ్ల మీద తిరిగితే భయపడే పేరెంట్స్ ఇప్పుడు వందల మంది తోటి పిల్లలు, ఉపాధ్యాయులు ఉన్న ప్రాంగణంలో కూడా సురక్షితంగా ఉండగలరు అనే నమ్మకాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వాలు కూడా ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్న ఉన్మాదుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే రేపటి రోజున ఇటువంటి ఆలోచనలు వచ్చే వారి వెన్నులో వణుకు పుడుతుంది.

ఇలా ఎదో ఒక దారుణ సంఘటన జరిగినప్పుడు కాసేపు హడావుడి చేసి అటుపైన ఎవరి పని వారు చూసుకుంటే ఇటువంటి ఘటనలు రేపటి రోజున సర్వసాధారణంగా మారే ప్రమాదం లేకపోలేదు. పాఠశాలలో భద్రతా పర్యవేక్షణాల మీద ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన సమయం ఆసన్నమయ్యింది అని ఇటువంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

రాజకీయ పార్టీలు కూడా ఇటువంటి అమానవీయ ఘటనలను సాకుగా చూపి రాజకీయాలు చేయకుండా సమస్య పరిష్కారానికి సూచనలు చెయ్యాలి. సమస్యను మొదటిలోనే నివారించగలిగితే అది పెరిగే అవకాశం ఉండదు అనేది ప్రభుత్వాలు గ్రహించాలి. రాప్తాడు ఘటన నిందితుడి పై ప్రభుత్వం తీసుకునే చర్యలు, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు రేపటి ఉన్మాద ఆలోచనలకు సమాధి కట్టెల ఉండాలని ఆశిద్దాం..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

పిల్లలలో ఉన్మాదం…ఎవరిదీ పాపం..?

మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…

11 minutes ago

స్థానిక ఎన్నికలు: మావిగన్ లో వైసీపీ జెండా ఎగరేస్తుందా.?

రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ పార్టీకి ఒక స్పష్టత లేదని, ప్రతి ఎన్నికలకొకసారి రాజధాని పేరును మారుస్తూ వైసీపీ రాజధాని…

29 minutes ago