
సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లోకి వెళ్ళిపోతాననే ఆందోళనతో, ఓ తుపాకీ కొనిస్తే ఇంట్లోనే ఉండవచ్చని ఆలోచించి, నాడు తన అన్నయ్య చిరంజీవి తుపాకీ కొనిచ్చారని, అయితే తన ఆవేదన, ఆవేశం అన్యాయం మీద తప్ప తుపాకీ మీద కాదని, ఈ విషయం నాడు తన అన్నయ్యకు వివరించలేకపోయానని కళావాహిని పోర్ట్ స్టేడియంలో జరిగిన సమావేశంలో పవర్ స్టార్ చెప్పుకొచ్చారు.
ఇంత చెప్పిన పవన్, నాడు ఆ తుపాకీని తీసుకున్న సమయంలో అసలు దానిని ఎలా ఉపయోగించాలో కూడా తెలియదని చెప్పడం కొసమెరుపు. పవన్ తన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడంలో… అప్పటి పవన్ మానసిక స్థితి ఏమిటో చెప్పకనే చెప్పారు. ఇంత విన్న తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించిన “జల్సా” ఇంటర్వెల్ కు ముందు సీన్ నుండి ఆ తర్వాత జరిగిన అర్ధగంట సినిమా కళ్ళ ముందు కనిపించడం అభిమానులకు సహజమే కదా!
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…