
అయితే ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఏ పార్టీకి ఆధిక్యం రాదని, ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి సారిగా హంగ్ రాబోతుందని జోస్యం చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యకూడా ఒక రకంగానే తప్పు అనే చెప్పుకోవాలి. 175 నియోజకవర్గాలలో పోటీ చేసే పార్టీ ధైర్యంగా మేము అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పగలగాలి.
అంతేగానీ హంగ్ రాబోతుంది అని చెప్పడం భేలతనంగానే ప్రజలకు కనబతుంది. దీని వల్ల శ్రేణులకు కూడా పాజిటివ్ సిగ్నల్స్ వెళ్లవు. దీనిని కూడా పవన్ కళ్యాణ్ ఎంత త్వరగా మార్చుకుంటే అంత మంచిది. లేదా హంగ్ అంటూనే ఉంటే అటువంటి పరిస్థితుల్లో జనసేన ఎవరి వైపు ఉంటుంది అనేదానికి సమాధానం చెప్పగలగాలి.
A shocking and disturbing incident has been reported from Bengaluru, where a young man was…
The much-discussed Koratala Siva’s Devara 2 has slipped into uncertainty, leaving Jr. NTR fans hanging…