
నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదని పేర్కొన్న రేణూ దేశాయ్, ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా పవన్ నటించిన సినిమాలకు పనిచేశానని తెలిపింది. అలా పని చేసిన సినిమాల్లో ‘ఖుషి’, ‘బాలు’ సినిమాలు ఉన్నాయని చెప్పింది. ‘జానీ’ సినిమాలో ఆమె పని చేసినట్టు టైటిల్స్ లో ప్రకటించారు. కానీ ‘ఖుషి’, ‘బాలు’ సినిమాల టైటిల్స్ లో రేణూ పేరు వేయలేదు. వాస్తవానికి ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహ’ పాటను తానే ఎడిటింగ్ చేశానని రేణూ దేశాయ్ తాజాగా వెల్లడించింది.
అలాగే ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశానని, అకీరా పది రోజుల పసికందుగా ఉన్నప్పుడు కూడా ‘బాలు’ సినిమా కోసం పనిచేశానని తెలిపింది. అలా పని చేయడానికి కారణం పవన్ ప్రోత్సాహమేనని, తనను శక్తిమంతమైన మహిళగా పవన్ పరిగణించడమే కారణమని రేణూ దేశాయ్ తెలిపింది. ఈ సందర్భంగా తన రెండవ వివాహంపై కూడా స్పందించింది. రేణూతో విడిపోయాక పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ… రేణూ మాత్రం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది.
దీనిపై స్పందిస్తూ… వాస్తవానికి రెండో పెళ్లి గురించి చాలా కన్ఫ్యూజన్ కు గురయ్యానని… దీని గురించి ఓ కౌన్సిలర్ వద్దకు కూడా వెళ్లానని చెప్పింది. ఆమెకు తనలో ఉన్న భావాలన్నింటినీ చెప్పానని… దీంతో మరో పెళ్లి చేసుకోవచ్చు కదా? అని ఆమె చెప్పారని తెలిపింది. అయినా పవన్ తో తాను విడిపోయినా, అతనిపై తనకు ప్రేమ ఉందని చెప్పింది. ఒక వేళ రెండో పెళ్లి చేసుకున్నా తనకు తోడు మాత్రమే లభిస్తుందని… తన ప్రేమను పెళ్లి చేసుకున్న వ్యక్తికి పంచలేనని రేణు తెలిపింది.
పెళ్లి చేసుకున్న వ్యక్తి తన పిల్లలకు సవతి తండ్రి అవుతాడే తప్ప తండ్రి కాలేడు కదా? రెండో పెళ్లిలో కచ్చితంగా ప్రేమ ఉండదని తేల్చి చెప్పింది. రెండో పెళ్లి దిశగా తనకు కూడా ఆలోచనలు వస్తుంటాయని, కానీ, కొన్ని భయాలు వెంటాడుతుంటాయని తెలిపింది. రెండో పెళ్లి తర్వాత కూడా మళ్లీ తొలిసారి ఎదురైన అనుభవాలే ఎదురవుతాయేమో అనే భయం కూడా వెంటాడుతుందని చెప్పింది. మళ్లీ ప్రేమలో పడతానో లేదో కూడా తెలియదని, సరైన వ్యక్తి దొరికితే తన రెండో పెళ్లి విషయం స్వయంగా చెబుతానని తెలిపింది.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…