
[m9ad]
నా కర్మ… కుదరలేదు… ఇలా జరిగింది… ఏం చేద్దాం… మంచో చెడో జరిగింది… నాకేమీ ఒళ్ళు పొగరెక్కి చేసుకోలేదు మూడు పెళ్ళిళ్ళు..! నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టం, ఎందుకంటే వీడు ఎప్పుడూ బయటోళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాడు, వాళ్ళకు ఏమైంది, వీళ్ళకు ఏమైంది అంటూ రోజూ ఏడుస్తూ ఉంటాను, దీంతో నా పక్కనుండే వాళ్లకి సుఖం ఏముంటుంది? అంటూ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు.
తనను సినిమా యాక్టర్ అని అందరూ అనుకుంటారని, కానీ నేను లోపల ఓ గది మూలలో కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటానని, పార్టీలు ఉండవ్, పబ్ లు ఉండవ్… ఎప్పుడూ ఆవులు, గేదెలు దగ్గర ఉంటాను, లేదంటే ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను, నాతో సుఖం ఏముంటుంది? అంటూ తన మూడు పెళ్ళిళ్ళకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేసారు పవన్ కళ్యాణ్.
Rumors linking actors and actresses romantically are common in the film industry. But a young…
The Andhra Pradesh State Election Commission (AP SEC) has revised the schedule for the MPTC…