
ఆర్ఆర్ఆర్ కు రాజమౌళి, తారక్, చరణ్ లు తిరిగినన్ని ఊళ్లు, దేశాలు బహుశా ఇప్పట్లో ఎవరూ రిపీట్ చేయకపోవచ్చు. పబ్లిసిటీ తాలూకు ప్రభావం అది. కానీ బ్రో విషయంలో మాత్రం ఎలాంటి సౌండ్ వినిపించడం లేదు. ఈ రోజు వదిలేస్తే సరిగ్గా ఇరవై రోజుల్లో రిలీజ్ ఉంది. రేపో మొదటి ఆడియో సింగల్ అనౌన్స్ మెంట్ ఇస్తారట.
అసలు ఎన్ని పాటలు ఉన్నాయి, వాటిని ఎలా షెడ్యూల్ చేశారు, ట్రైలర్ ఎప్పుడు వదులుతారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ప్లాన్ చేసారు తదితర బోలెడు ప్రశ్నలు అభిమానుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. బాలన్స్ ఉన్న షూటింగ్ ని సాయి ధరమ్ తేజ్ మొన్నే విదేశాల్లో పూర్తి చేసుకుని వచ్చారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఉన్నాయి.
అసలైన పవన్ చెప్పాల్సిన డబ్బింగ్ ఇంకా ఉంది. ఆపై సెన్సార్ కు వెళ్ళాలి. ఇంత ఒత్తిడి మధ్య బ్రో ప్రచారానికి టైం ఎక్కడిదంటే సమాధానం చెప్పడం కష్టం. ఎంత పవన్ కళ్యాణ్ ఉన్నా మొదటి రెండు మూడు రోజులు ఓపెనింగ్స్ ఢోకా ఉండదు కానీ ఆ తర్వాత సామాన్య ప్రేక్షకులు రావాలంటే మాత్రం సైలెంట్ గా ఉంటే సరిపోదు.
అసలే ఏపీలో అధికార పార్టీతో పవన్ కు ఉప్పు నిప్పులా ఉంది. ఇలాంటి పరిస్థితిలో టికెట్ రేట్లు, స్పెషల్ షోల పంచాయితీలు ఎలా ఉంటాయోననే టెన్షన్ ఫ్యాన్స్ లో లేకపోలేదు. అసలే ఇది రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చూసినవాళ్లకు పవన్ తేజు కాంబినేషన్ తప్ప చూసేందుకు ఇంకే కారణం లేదు. పైగా సముతిరఖని పాపులర్ నటుడే కానీ మనదగ్గర పేరున్న దర్శకుడు కాదు.
త్రివిక్రమ్ చేసిన మార్పులతో కమర్షియల్ టచ్ తో బ్రోని ఎలా తీసి ఉంటాడన్న అనుమానం లేకపోలేదు. ఇవన్నీ సెటిల్ కావాలంటే బ్రో స్పీడ్ పెంచాలి. వారాహి రెండో విడత యాత్ర వచ్చే వారమే ప్లాన్ చేసుకుంటున్న పవన్ తో పైవన్నీ అనుసంధానించుకోవడం సవాలే. పోనే రిలీజే వాయిదా వేసుకోవాలన్నా ఛాన్స్ లేదు. ఆగస్ట్ నెల ప్యాక్ అయిపోయింది. సెప్టెంబర్ కూడా అంతే. సో చేతిలో ఉన్న ఇరవై రోజుల్లో బ్రో టీమ్ పెట్టే పరుగులు మాములుగా ఉండవు
Nagarjuna has raised an important point about the release problems faced by smaller films like…
Kiran Abbavaram, who has acted in several successful films, is making his directorial debut with…