
మార్చి 12వ తేదీన ఆదివారం నాడు అశేష అభిమానుల సమక్షంలో “సర్ధార్ గబ్బర్ సింగ్” పాటలను విడుదల చేయనున్నారు. అలాగే సినిమా విడుదల ముహూర్తాన్ని ఏప్రిల్ మొదటి వారంలో అని ఖరారు చేసారు అని తెలుస్తున్నప్పటికీ, ఏప్రిల్ 8వ తేదీని ‘లాక్’ చేసినట్లుగా ట్రేడ్ టాక్. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటి సారిగా పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ కనువిందు చేస్తోంది. అలాగే ఓ ఐటెం సాంగ్ లో పవన్ తో కలిసి లక్ష్మీ రాయ్ చిందులేయనుంది.
పవన్ కళ్యాణ్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు పవన్ కూడా కో – ప్రొడ్యూసర్ (పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ రూపం)గా ఉన్నారు. అలాగే ఈ సినిమా ధియేటర్ హక్కులను ‘ఈరోస్’ ఇంటర్నేషనల్ సంస్థ ఇప్పటికే దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగునాట వచ్చిన సీక్వెల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డ నేపధ్యంలో రత్నాపూర్ కా ‘సర్ధార్’ ఏం చేయనున్నారో అన్న ఆసక్తి అభిమానులతో పాటు సినీ వర్గీయుల్లో నెలకొంది.
PVR Cinemas has added a very familiar Indian snack to its food menu, but the…
Recently, an official announcement regarding actress Priyanka Mohan's next film was dropped, and it is…