
కానీ, సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది రిలీజ్ చేస్తున్న టీజర్లలో పవర్ స్టార్ పేలుస్తున్న పంచ్ లకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఓ రెండు టీజర్లలో పొందుపరిచిన ‘సర్ధార్’ డైలాగ్స్ ను ఫ్యాన్స్ రాసేసుకుంటున్నారు. “ఆయన డబ్బుకు, భయానికి లొంగడు… ఆయనకి మీరు వోన్ అవ్వాలంటే… ముందు ట్యూన్ అవ్వాలి, లేకపోతే ఫ్యాన్ అవ్వాలి…” అంటూ పవర్ స్టార్ ను ఉద్దేశించి కమెడియన్ అలీ చెప్పిన డైలాగ్స్ మరియు “చిన్నప్పటి నుండి ముద్ద పెట్టే వాళ్ళే గానీ, ముద్దులు పెట్టే వాళ్ళు లేక ముద్దులకు కరువాసిపోయాను” అంటూ కాజల్ తో పవన్ చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే… మల్టీప్లెక్స్ ధియేటర్లలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ లు ఓపెన్ చేయకపోవడంతో అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు. బహుశా మరికొద్ది గంటల్లో ఈ వివాదానికి పరిష్కారం లభించే అవకాశముందని ట్రేడ్ వర్గాల టాక్. మల్టీప్లెక్స్ లు మినహా ఇతర ధియేటర్లలో ఇప్పటికే భారీ ఎత్తున బెనిఫిట్ షో మరియు మొదటి షో బుకింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…