Telugu

ఒకే రోజు… టాలీవుడ్ లో మూడు పెద్ద సినిమాల కీలక పరిణామాలు

డిసెంబర్ 21 సోమవారం అనగా ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో మూడు పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించనున్న అయ్యప్పనుమ్ కోశియుమ్ తెలుగు రీమేక్ ఈరోజు ముహూర్తం జరుపుకుంది. దేవుని పటాలపై పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, సుప్రసిద్ధ దర్శకులు త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు.

చిత్రం స్క్రిప్ట్ ను హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 2 నుండి హైదరాబాద్ లో జరుగుతుంది. మరోవైపు… టాలీవుడ్ లో మరో రెండు సినిమాలు తమ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాయి. నాని శ్యామ్ సింఘా రాయ్, నాగచైతన్య థాంక్ యూ షూటింగ్ మొదలుపెట్టాయి.

ADVERTISEMENT

చాలా కాలంగా పక్కాగా ప్రీ-ప్రొడక్షన్ చేపడుతున్న ఈ రెండు సినిమాలు ఈరోజు హైదరాబాద్ లో తమ షూటింగులు మొదలు పెట్టుకున్నాయి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ శ్యామ్ సింఘా రాయ్ కి దర్శకత్వం వహిస్తుండగా మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ థాంక్ యూ కు మెగాఫోన్ పట్టుకోనున్నారు.

కల్కత్తా బ్యాక్ డ్రాప్ లో నాని విభిన్నమైన కథాంశంతో శ్యామ్ సింఘా రాయ్ లో కనిపించబోతున్నాడని ఈ సినిమా మీద హైప్ భారీగా ఉంది. అదే సమయంలో మనం వంటి క్లాసికల్ హిట్ తరువాత విక్రమ్, నాగచైతన్య కలిసి థాంక్ యూ చేస్తుండడంతో ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Can Vijay and Udhayanidhi Become the Next CBN-YSR?

The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…

9 minutes ago

Anil Ravipudi’s Clever Strategy Before Audience Gets Bored

One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…

29 minutes ago