
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ట్విటర్ ను పవన్ విషెస్ తో నింపేశారు. సహజంగా సెలెబ్రిటీల బర్త్ డేలకు పెద్ద ఎత్తున విషెస్ వస్తే పేరు పేరున రెస్పాండ్ కావడం కష్టం కాబట్టి ఒక ట్వీట్ లో అందరికీ థాంక్స్ చెబుతున్నారు.
అయితే పవన్ మాత్రం నిన్న సాయంత్రం మొదలుపెట్టి ఈరోజు కూడా తనకు విష్ చేసిన వారందరికీ పేరు పేరున థాంక్స్ చెబుతున్నారు. బీజేపీ లీడర్ల నుండి సంపూర్ణేష్ బాబు వరకు కొద్దో గొప్పో పేరున్న అందరికీ థాంక్స్ చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చెబుతున్నారో లేక ఆయన డిజిటల్ టీం చెబుతుందో తెలీదు గానీ ఈ థాంక్స్లు అలా సాగిపోతూనే ఉన్నాయి.
దీని మీద కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. వచ్చే బర్త్ డే వరకు థాంక్స్ చెబుతూనే ఉంటారా అని వ్యంగ్యంగా అంటున్నారు. అభిమానులు మాత్రం అది మా అన్న సంస్కారం అంటూ సమర్ధించుకుంటున్నారు. మొత్తానికి పవన్ ఆ విధంగా ఇంకా బర్త్ డే మూడ్ లోనే ఉండిపోయారు.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…