
తమిళ సెన్సేషన్ ‘కొలావేరి’ అనిరుధ్ ను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మార్చేసాడు. అనిరుధ్ ఇచ్చిన ట్యూన్స్ త్రివిక్రమ్ కు సరిగా నచ్చలేదని, ముఖ్యంగా తెలుగుదనంతో కూడుకుని లేవన్న కారణాలు అప్పట్లో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటికప్పుడు మిక్కి జే మేయర్ ను ఎంపిక చేసుకోవడం, అతి తక్కువ సమయంలో మిక్కి పాటలు అందించాడని స్వయంగా త్రివిక్రమ్ ఆడియో వేడుక మీద చెప్పడం కూడా తెలిసిన సంగతులే.
మరి అలా ఒకసారి అనిరుధ్ వలన ఇబ్బందులు పడిన త్రివిక్రమ్, మళ్ళీ అదే తప్పు చేస్తున్నారనే సమాచారం టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయబోతున్న సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నితిన్ సినిమాకే తెలుగు నేటివిటీకి తగిన విధంగా సంగీతం అందించలేని అనిరుధ్, మరి పవర్ స్టార్ లాంటి ఓ స్టార్ హీరో సినిమాకు ఏ మాత్రం న్యాయం చేస్తాడో అన్న ప్రశ్న అభిమానుల్లో నెలకొనడం సహజమే.
అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకాస్త సమయం ఉండడంతో, ఈ మధ్యలో “ఏదైనా” జరవచ్చన్న టాక్ వినపడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంభినేషన్ లో వచ్చిన రెండు “జల్సా, అత్తారింటికి దారేది” సినిమాలకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అభిమానులు అంచనాలు వేసిన విధంగానే సందడి చేసాయి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…