
మంచి పనులు చేసేటప్పుడు కూడా వారు అలాగే ఉంటారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ కరోనాకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి రెండు కోట్ల విరాళం ఇచ్చారు. ఇందులో ఒక కోటి ప్రధానమంత్రి సహాయ నిధికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరో యాభై లక్షలు. పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధులకు చెరో 10 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో బాబాయ్ ప్రేరణతో 70 లక్షలు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇస్తున్నట్టు హీరో రామ్ చరణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో చాలా మంది తెలుగు ఇండస్ట్రీ సెలబ్రిటీస్ విరివిగా విరాళాలు ఇస్తున్నారు.
కొరటాల శివ (10 లక్షలు), అనిల్ రావిపూడి (10 లక్షలు) ఇప్పటికే ప్రకటించారు. మరింత మంది ప్రకటించే అవకాశం ఉంది. టాలీవుడ్ లో అందరికంటే ముందుగా నితిన్ రెండు తెలుగు ప్రభుత్వాలకు 20 లక్షల సహాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలోని పేదల కోసం వినాయక్ (5 లక్షలు), రాజశేఖర్ (నిత్యావసరాలు) ప్రకటించిన సంగతి తెలిసిందే.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…