
వారాహి వాహనాన్ని ఎన్నికల ప్రచారానికి అనుకూలంగా ప్రత్యేకంగా తయారుచేయించుకొన్నారు. దీని చుట్టూ అత్యంత శక్తివంతమైన లైట్లు, ఆధునిక సౌండ్ సిస్టమ్, సిసి కెమెరాలు అమర్చారు. వాహనం ఎక్కడ ఉన్నా దాని చుట్టుపక్కల ఏవిదంగా ఉంది?జనసందోహం ఏవిదంగా ఉంది?వారిలో అసాంఘికశక్తులు ముఖ్యంగా జనసేన ప్రత్యర్ధులు ఎవరైనా ఉన్నారా?ఉంటే వారు ఏం చేస్తున్నారు?వంటివన్నీ సిసి కెమెరాల ద్వారా రికార్డ్ అవుతూ హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సర్వర్కి రియల్ టైమ్ సమాచారం ఎప్పటికప్పుడు వెళుతుంటుంది. వాహనంలోపల ముగ్గురు వ్యక్తులు కూర్చొని సమావేశమయ్యేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ప్రజల మద్యకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వాహనంపైకి చేరుకొనేందుకు వీలుగా హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉంది. త్వరలోనే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ వాహనపూజ నిర్వహించబోతున్నారు.
సుదీర్గంగా, రాష్ట్ర వ్యాప్తంగా సాగే యాత్రలకి, ఎన్నికల ప్రచారానికి ఇటువంటి వాహనాలు చాలా అవసరంగానే మారాయి. కనుక పవన్ కళ్యాణ్ కూడా ఏర్పాటు చేసుకొన్నారు. అయితే జనసేన పార్టీ ఎన్నికలని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉందా?ముఖ్యంగా… సర్వశక్తివంతమైన వైసీపీ అభ్యర్ధులని, అవసరమైతే టిడిపిని ఎదుర్కొని గెలిచే సత్తా ఉన్న అభ్యర్ధులు జనసేనలో ఎంతమంది ఉన్నారు?లేకుంటే ప్రజలు పవన్ కళ్యాణ్ని చూసి జనసేనలో అనామక అభ్యర్ధులకు ఓట్లేసి గెలిపిస్తారా?
అసలు జనసేన బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని నిర్మించుకొందా?రాబోయే ఎన్నికలలో జనసేన అన్ని స్థానాలలో పోటీ చేయాలనుకొంటోందా లేక తనకు బలమున్నట్లు భావిస్తున్న 15-20 స్థానాలకే పరిమితం అవుతుందా? ఇంతకీ జనసేన బిజెపితో ఉంటుందా లేక టిడిపితో చేతులు కలుపుతుందా? పవన్ కళ్యాణ్ ఇకపై పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తారా లేక మద్యలో సినిమా షూటింగులకి వెళుతుంటారా? వంటి అనేకానేక ప్రశ్నలకు జనసేన దాని అధినేత పవన్ కళ్యాణ్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగి ఉండాలి. లేకుంటే ఈ వాహనం ఓ షో పీసుగానే మిగిలిపోవచ్చు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…