‘రత్నాపూర్’ సర్దార్ రాక కోసం తప్పట్లేదు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా స్పెషాలిటీ ఇది. ఈ సినిమా కోసం పవన్ తన కెరీర్ లోనే మొదటి సారిగా రెండు యూనిట్స్ తో పని చేస్తున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఏప్రిల్ 8వ తేదీ నాటికి తన ‘సర్దార్’ మూవీ రిలీజ్ కావాలంటే ఈ మాత్రం హార్డ్ వర్క్ చేయాలని పవన్ కోరినట్టు సమాచారం. అందుకే ఒకేసారి రెండు యూనిట్లను రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తిందని ట్రేడ్ వర్గాల టాక్.

ప్రధాన తారాగణంతో సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఓ యూనిట్ ఉందని, దీనిని దర్శకుడు బాబీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా, కో-డైరెక్టర్ సారధ్యంలో మరో యూనిట్ సాధారణ సన్నివేశాలను కెమెరాలో బంధించే పని చేస్తోందని సమాచారం. మార్చి మొదటి వారం నాటికి సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నది చిత్ర యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Share
Published by

Recent Posts

CM Vijay Back as Thalapathy? Once Again Ready to Shoot

Tamil Nadu Chief Minister Vijay is reportedly set to face the camera again, but this…

12 minutes ago

Ramayana Day 1: Big Hopes Crashed? Can It Still Recover?

Namit Malhotra's Ramayana has taken a decent start at the Hindi box office, with Day…

33 minutes ago