Telugu

అనవసర వివాదం కొని తెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్

2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలకు ప్రచారం చేసారు. వారి విజయంలో ఆయన పాత్ర కచ్చితంగా ఉంది. ఎంత అనేది వారి వారి అభిప్రాయాన్ని బట్టి రాజకీయ అవసరాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అడపాదడపా రెండు పార్టీలను ఓ మోస్తరుగా ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో కాస్తా పెరిగింది.

ADVERTISEMENT

విషయానికి వస్తే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం విషయంలో కొంత గందరగోళం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. టీడీపీ బీజేపీ వాదనలలో ఏది నిజమో నిర్ధారించడానికి జేపీ, ఉండవల్లి న్యాయకత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్టు ఉండవల్లి చెప్పారు. ఈ సంధర్భంగా ఇరు వైపులలో ఒకరు అబద్దం చెబుతున్నారని అది ఎవరో కనిపెట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇరువైపుల వారు వారు చెప్పే లెక్కలు తనకు పంపిస్తే నేను కమిటీకి పంపుతా అని తరువాత ఒక నిర్ణయానికి వస్తా అని దాని సారాంశం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు ఏ హోదాలో పవన్ కళ్యాణ్ లెక్కలు తనకు పంపమని అడుగుతున్నారు?

ప్రజాస్వామ్యంలో ఎవరైనా శ్వేతపత్రం ఇవ్వమని డిమాండ్ చెయ్యవచ్చు లేదా వ్యక్తిగతంగా కావాలంటే ఆర్టీఐ ఉండనే ఉంది. 2014లో ప్రచారం చేశా కదా అని ఒక వ్యక్తి ప్రభుత్వాలను శాసించే ప్రయత్నం చెయ్యొచ్చా? ఆయన వెనుక ఒక కులం కొంత మంది ఓటర్లు ఉన్నారనే కారణంగా ప్రభుత్వాలు దానికి ఒప్పుకోవచ్చా?

పైగా పవన్ కళ్యాణ్ దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. మాములుగా అయితే ఇలా మాట్లాడితే వారిని రాజ్యాంగేతర శక్తి అంటారు అయితే పవన్ కళ్యాణ్ ను అలా అనడానికి కొంత ఆలోచిస్తారు ఎవరైనా. కావున పవన్ కళ్యాణ్ ఇలా ప్రభుత్వాలను శాసించే పని మానేసి ఈ సమాచారమంతా ఆర్టీఐ ద్వారా తెప్పించుకుంటే అందరికి మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Suriya Puts an End to the Mumbai Home Confusion

For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…

21 minutes ago

Did Prithviraj Risk Rajamouli’s Varanasi for Kareena?

Prithviraj Sukumaran has revealed an interesting reason behind his decision to do Meghna Gulzar's crime…

51 minutes ago